ఆ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ కోసం..
భాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించిన సింగ్ ఈజ్ కింగ్ చిత్రం త్వరలో సీక్వెల్ రూపం సంతరించుకోనుంది. హీరో, హీరోయిన్స్ అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్ లతో పాటు విపుల్ షా కూడా ఈ సీక్వెల్ కు పనిచేయనున్నారు. ఈ విషయాన్ని విపుల్ షా మీడియాకు చెపుతూ...'సింగ్ ఈజ్ కింగ్' సీక్వెల్ స్క్రిప్టు పనులు పూర్తయ్యాయి. త్వరలోనే షూటింగ్ ప్రారంభించాలని అనుకుంటున్నాం. ఇందులోనూ నాయకానాయికలుగా అక్షయ్ కుమార్, కత్రినలనే ఎంపిక చేసుకున్నాం అలాగే 'సింగ్ ఈజ్ కింగ్‌కు సీక్వెల్ అనగానే ప్రేక్షకుల్లో ఓ విధమైన అంచనాలుంటాయి. వాటిని అందుకొనేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాను. వినోదాత్మకంగా ఉంటుంది. వచ్చే ఏడాది జూన్, జులైల్లో విడుదల చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. అక్కడ హిందీలోనే కాక మన తెలుగులోనూ ఆర్య-2 అంటూ ఓ సీక్వెల్ రంగంలోకి దూకనుంది. ఇప్పటికే విలేజ్ లో వినాయకుడు అంటూ ఓ సీక్వెల్ వచ్చింది.


Click it and Unblock the Notifications











