'సింగ్ ఈజ్ కింగ్'ఏ హీరోతో?

ఓ పని చేస్తే..పది సమస్యలు తెచ్చిపెట్టే హీరో కి తమ ఊరికి సంభందించిన వాడు సిటీలో డాన్ గా బ్రతుకుతున్నాడని తెలుస్తుంది. వారి తల్లితండ్రులు,ఊరి వారి కోరిక మేరకు అతన్ని మార్చి తమ ఊరుకి తీసుకొద్దామని బయిలుదేరతాడు. ఆ ప్రయాణంలో అతనికి హీరోయిన్ పరిచయం అవుతుంది. ఎలా తన లక్ష్యాన్ని,హీరోయిన్ని సాధించుకున్నాడనేది ఫన్ తో కూడిన జర్నీ ఈ సినిమా.
పూర్తి కామిడీ,సెంటిమెంట్ కలగలిపిన అక్షయ్ పాత్రకు యంగ్ హీరోల్లో చాలా మంది ఫాన్ అయ్యామని ఆ కోణంలో కథలు వండమని మరో ప్రక్క పురమాయిస్తున్నారు. ఇలా ఎవరి కోణంలో వారు ప్రీమేక్ చేయాలనో,రీమేక్ చేద్దామనో,ప్రేరణ పొందుదామనో ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ కాంపిటేషన్ లో ఎవరు నెగ్గుతారన్నది మాత్రం వెయిట్ చేసి చూడాల్సిందే. ఏదైమైనా 2009లో లోకల్ సింగ్ ఈజ్ కింగ్ ని చూడచ్చు చక్కగా.


Click it and Unblock the Notifications











