twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'సింగ్ ఈజ్ కింగ్'ఏ హీరోతో?

    By Staff
    |

    Singh Is Kinng
    బాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన 'సింగ్ ఈజ్ కింగ్' సినిమా తెలుగులో పునర్నించటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే అక్షయ్ కుమార్ చేసిన పాత్రకు జగపతి బాబుని అడుగుతున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో వినపడుతోంది. అలాగే కత్రినా కైఫ్ పాత్రకు అనూష్క,నేహా ధూపియా పాత్రకు మమతామోహన్ దాస్ ని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారని చెప్తున్నారు. అయితే ఇప్పటికే ఓ నిర్మాత కళ్యాణరామ్ తో ఈ సినిమా రీమేక్ చేస్తే ఎలా ఉంటుందనే ప్రపోజల్ తో ముందుకువెళ్తున్నాడని ఓ కథనం.

    ఓ పని చేస్తే..పది సమస్యలు తెచ్చిపెట్టే హీరో కి తమ ఊరికి సంభందించిన వాడు సిటీలో డాన్ గా బ్రతుకుతున్నాడని తెలుస్తుంది. వారి తల్లితండ్రులు,ఊరి వారి కోరిక మేరకు అతన్ని మార్చి తమ ఊరుకి తీసుకొద్దామని బయిలుదేరతాడు. ఆ ప్రయాణంలో అతనికి హీరోయిన్ పరిచయం అవుతుంది. ఎలా తన లక్ష్యాన్ని,హీరోయిన్ని సాధించుకున్నాడనేది ఫన్ తో కూడిన జర్నీ ఈ సినిమా.

    పూర్తి కామిడీ,సెంటిమెంట్ కలగలిపిన అక్షయ్ పాత్రకు యంగ్ హీరోల్లో చాలా మంది ఫాన్ అయ్యామని ఆ కోణంలో కథలు వండమని మరో ప్రక్క పురమాయిస్తున్నారు. ఇలా ఎవరి కోణంలో వారు ప్రీమేక్ చేయాలనో,రీమేక్ చేద్దామనో,ప్రేరణ పొందుదామనో ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ కాంపిటేషన్ లో ఎవరు నెగ్గుతారన్నది మాత్రం వెయిట్ చేసి చూడాల్సిందే. ఏదైమైనా 2009లో లోకల్ సింగ్ ఈజ్ కింగ్ ని చూడచ్చు చక్కగా.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X