»   »  సంపూర్ణేష్ బాబు ‘సింగం 123’ రిలీజ్ డేట్ ఫిక్స్

సంపూర్ణేష్ బాబు ‘సింగం 123’ రిలీజ్ డేట్ ఫిక్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు త్వరలో ‘సింగం 123' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ ఖరారైంది. జూన్ 5న ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అక్షత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బేనర్లో మంచు విష్ణు నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది.

Singham 123 grand release on 5th June

ఈచిత్రాన్ని మంచు విష్ణు నిర్మిస్తుండటంతో సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ చిత్రానికి పబ్లిసిటీ ఓ రేంజిలో చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. నాలుక మడతెట్టి సంపూర్ణేష్ బాబు ఫోటోలకు పవర్ ఫుల్ ఆటిట్యూడ్ తో ఇచ్చిన ఫోజులు ఆకట్టుకుంటున్నాయి.


దర్శకుడు మాట్లాడుతూ.... సంపూర్ణేష్‌బాబు నుంచి ప్రేక్షకులు ఏ తరహా వినోదాన్ని కోరుకుంటున్నారో అది ఈ సినిమాలో వంద శాతం వుంటుంది. కథకు తగ్గ హీరో కుదిరారు. ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కించనున్నాం అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ నేటి వాస్తవ పరిస్థితులని ప్రతిభింబిస్తూ..నేటి యువతరాన్ని ఉత్తేజపరుస్తూ ఆద్యంతం వినోదాత్మకంగా ఈ చిత్రం ఉంటుంది అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల, ఎడిటర్: యం.ఆర్.వర్మ, మ్యూజిక్: శేషు, డైలాగ్స్: డైమండ్ రత్నం, ఆర్ట్: రఘు కులకర్ణి, కథ-స్క్రీన్ ప్లే-నిర్మాత: విష్ణు మంచు, దర్శకత్వం: అక్షత్ అజయ్ శర్మ.

English summary
Sampoo’s latest flick Singham 123 is getting ready for a grand release on the 5th of June.
Please Wait while comments are loading...