నాలుక మడతెట్టిన సంపూ... పవర్ ఫుల్ లుక్ (ఫోటోస్)
హైదరాబాద్: ‘హృదయ కాలేయం' సినిమాతో ఊహించని విధంగా టాలీవుడ్లో క్లిక్ అయిన సంపూర్ణేష్ బాబు త్వరలో ‘సింగం 123' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతన్నారు. ఈచిత్రాన్ని మంచు విష్ణు నిర్మిస్తుండటంతో సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.
ఈ చిత్రానికి కూడా పబ్లిసిటీ వెరైటీగా చేస్తున్నారు. నాలుక మడతెట్టి సంపూర్ణేష్ బాబు ఫోటోలకు పవర్ ఫుల్ ఆటిట్యూడ్ తో ఇచ్చిన ఫోజులు ఆకట్టుకుంటున్నాయి. ఆ ఫోటలపై మీరూ ఓ లుక్కేయండి. ఈ ఫోటోలు చూసిన తర్వాత మీకు తప్పకుండా పైకి పవర్ ఫుల్ గా కనిపించే ఈ కామెడీ ఎంటర్టెనర్ చూడాలని కోరిక కలుగుతుంది.

మోహన్ బాబు సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా మంచు విష్ణు నిర్మిస్తోన్న ఈ చిత్రంలోసంపూర్ణేష్ బాబు పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. అక్షత్ అజయ్ శర్మ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను ఏప్రిల్ 8న విడుదల చేస్తున్నారు.
దర్శకుడు మాట్లాడుతూ.... సంపూర్ణేష్‌బాబు నుంచి ప్రేక్షకులు ఏ తరహా వినోదాన్ని కోరుకుంటున్నారో అది ఈ సినిమాలో వంద శాతం వుంటుంది. కథకు తగ్గ హీరో కుదిరారు. ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కించనున్నాం అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ నేటి వాస్తవ పరిస్థితులని ప్రతిభింబిస్తూ..నేటి యువతరాన్ని ఉత్తేజపరుస్తూ ఆద్యంతం వినోదాత్మకంగా ఈ చిత్రం ఉంటుంది అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల, ఎడిటర్: యం.ఆర్.వర్మ, మ్యూజిక్: శేషు, డైలాగ్స్: డైమండ్ రత్నం, ఆర్ట్: రఘు కులకర్ణి, కథ-స్క్రీన్ ప్లే-నిర్మాత: విష్ణు మంచు, దర్శకత్వం: అక్షత్ అజయ్ శర్మ.


Click it and Unblock the Notifications











