వంద కోట్లు కలెక్షన్ లిస్ట్ లో కి ‘సింగమ్’..!
అజయ్ దేవగన్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన తాజా చిత్రం 'సింఘం", ఇటీవలే ఈ చిత్రం విడుదలై ఘనవిజయం సాధించిన సంగతి విధితమే. అయితే తమిళ, తెలుగు భాషల్లో ఘనవిజయం సాధించింది. కానీ హిందీలో విడుదలైన ఈ చిత్రం ఆరు వారాల్లో 100కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. 100కోట్లు కలెక్షన్లను కొల్లగొట్టిన సినిమాల జాబితాలోకి ఈ చిత్రం 7వ స్థానాన్ని సంపాదించుకుంది. రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి రోహిత్ శెట్టి దర్శకత్వం వహించాడు.
రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్ ప్రొడ్యూసర్ మాట్లాడుతూ బాలీవుడ్ లో ఈ చిత్రం 100 కోట్లు దాటిన చిత్రాలలో 7వ చిత్రంగా నమోదనదని తెలిపారు. ఈ చిత్రం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోందని, ఈరోజుకి(సెప్టెంబర్ 10) 50రోజలను పూర్తి చేసుకుందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సక్సెస్ కి మంచి కథతో పాటు, రోహిత్ శెట్టి, అజయ్ దేవ్ గన్ లది అద్భుతమైన కాంబినేషన్ తో పాటు యాక్షన్ సీక్వెన్స్ బాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోదని రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్ సిఇఓ సంజీవ్ లంబా తెలిపారు.


Click it and Unblock the Notifications











