ఫస్ట్ డే కలెక్షన్స్ : ఈ యేడాది రికార్డ్ దీనికే

వివరాల్లోకి వెళితే...
'సింగమ్ రిటర్న్స్' అంటూ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకొచ్చిన అజయ్‌దేవగణ్ బాక్సాఫీస్ దగ్గర గర్జిస్తున్నాడు. తొలి రోజు రూ.32.09 కోట్ల వసూళ్లు సాధించిందీ చిత్రం. ఈ ఏడాది విడుదలైన చిత్రాల తొలి రోజు వసూళ్లలో ఇదే అత్యధికం.
దీంతో ఇప్పటిదాకా తొలి స్థానంలో ఉన్న సల్మాన్‌ఖాన్ 'కిక్' (రూ.26.40కోట్లు) రెండో స్థానానికి చేరింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల కావడం వల్ల 'సింగమ్ రిటర్న్స్'కు వసూళ్ల పంట పండిందని విమర్శకులు అంటున్నారు.
మొత్తంగా బాలీవుడ్‌లో ఇప్పటిదాకా విడుదలైన చిత్రాల్లో తొలిరోజు వసూళ్లను పరిశీలిస్తే 'సింగమ్ రిటర్న్స్'కు నాలుగో స్థానం దక్కింది. తొలి మూడు స్థానాల్లో 'ధూమ్3' (రూ.36.22 కోట్లు), 'చెన్నై ఎక్స్‌ప్రెస్' (రూ.33.12 కోట్లు), 'ఏక్ థా టైగర్' (రూ.32.93కోట్లు) చిత్రాలున్నాయి.


Click it and Unblock the Notifications











