twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరు కుటుంబంలో చిచ్చు పెట్టినందుకు శిరీష్ కు కాంగ్రెస్ బహుమతి!

    By Sindhu
    |

    ప్రజారాజ్యం పార్టీ అధినేత, సినీ నటుడు చిరంజీవి చిన్న అల్లుడు శిరీష్ భరద్వాజ్ కి రాష్ట్ర ప్రభుత్వం అరుదైన పోస్ట్ నిచ్చింది. ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యుడిగా శిరీష్ భరద్వాజ్ నియమితులయ్యారు. సెన్సార్ బోర్డ్ లో స్థానం కోసం రాజకీయ ప్రాబల్యం ఉపయోగించుకోవడం ఇప్పుడు కొత్తగా వస్తున్న విషయమేమి కాదు. సినిమా సెన్సార్ విషయంలో బోర్డు సభ్యులతో లుకలుకలకు దర్శక నిర్మాతలు పాల్సడతారనే ఆరోపణలున్నాయి ఆ రకంగా సెన్సార్ బోర్డు సభ్యులకు కాసుల పంట పండుతుందనేది ఫిలిం సర్కిల్స్ లో ఆఫ్ ది రికార్డ్ గా చెప్పుకునే మాట.

    చిరంజీవి నుంచి శిరీష్ కి ఈ ఛాన్స్ దక్కిందో, లేక చిరు కుటుంబంలో చిచ్చు పెట్టి, ఆయన్ను రోడ్డుకీడ్చినందుకు శిరీష్ కి కాంగ్రెస్ పార్టీ బహుమతిగా ఈ పోస్ట్ ఇచ్చిందోగానీ, మొత్తమ్మీద శిరీష్ సెన్సార్ బోర్డ్ సభ్యుడైపోయాడు. చిరంజీవి చిన్న కుమార్తెను ప్రేమలో పడేసి, రహస్య వివాహమాడి మీడియాకెక్కిన శిరీష్ భరద్వాజ్, అప్పట్లో మీడియా చేసిన హడావిడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదేమో. ఏదైతేనేం తన భర్త ఫిలిం సెన్సార్ సభ్యుడిగా ఎన్నికైనందుకు శ్రీజ సంతోషం వ్యక్తం చేసింది.

    అయితే సమాజం పట్ల బాధ్యత, సమాజానికి కీడు చేసే అంశాల పట్ల పూర్తి అవగాహన కలిగిన వ్యక్తులను మాత్రమే నిజానికి సెన్సార్ బోర్డ మెంబర్స్ గా ఎంపిక చేయాలి. అటువంటి సభ్య సమాజం ఏమాత్రం హర్షించని రీతిలో ఓ పెద్దింటి అమ్మాయిని పథకం ప్రకారం పెళ్లి చేసుకుని నేటి యువతరానికి ఓ 'బ్యాడ్ ఎక్జాంఫుల్" గా నిలిచి తన కాళ్ల పై తాను ఇంకా స్థిరపడని ఓ యువకునికి 'సెన్సార్ బోర్డ్ మెంబర్" వంటి అత్యంత బాధ్యతాయుతమైన పదవిని ఎలా కట్టబెడతారంటూ మేధావులంతా నిప్పుటు చెరుగుతున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X