twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలంగాణ ప్రభుత్వానికి థాంక్స్, నా సాహితీ వ్యవసాయానికి గుర్తింపు: ‘పద్మశ్రీ’పై సిరివెన్నెల

    |

    ఎన్నో ఏళ్లుగా తాను చేస్తున్న సాహితీ వ్యవసాయానికి ఒక గుర్తింపు దక్కిందని ప్రముఖ తెలుగు సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అన్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక 'పద్మశ్రీ' అవార్డుకు ఎంపికైన నేపథ్యంలో పార్క్ హయత్ హోటల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

    తెలంగాణ రాష్ట్రం నుంచి సిరివెన్నెల ఈ అవార్డుకు ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ పురస్కారానికి తన పేరును సూచించిన తెలంగాణ ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. సినీ రంగానికి తనను పరిచయం చేసిన ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్‌కు నమస్కరిస్తున్నట్లు వ్యాఖ్యానించారు.

     Sirivennela Seetharama Sastry about Padma Shri

    పద్మశ్రీ పురస్కారం ఎందుకు ఇవ్వాలో కేంద్రానికి చెప్పిన రిఫర్ చేసిన వారందరినీ ఆయన ధన్యవాదలు తెలిపారు. ప్రతి పాటను అవార్డుగానే భావిస్తాను, సినీ రంగాన్ని దేవాలయం కన్నా ఎక్కువగా ప్రేమిస్తానని ఆయన తెలిపారు.

    చాలా మందిలో సినిమాల వల్ల సమాజంపై కొంత చెడు ప్రభావం పడుతుందనే అభిప్రాయం ఉందని, సినిమా అనేది సమాజానికి అద్దం లాంటిదని, దీని వల్ల సమాజం చెడిపోతుందని తాను భావించడం లేదని అన్నారు.

    English summary
    Telugu Film Lyricist Sirivennela Seetharama Sastry conferred the Padma Shri Award in India’s 70th Republic Day.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X