twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అందరికీ ఇస్తాడు, నాకు ఇవ్వడు...అందుకే త్రివిక్రమ్ మీద కోపం: సిరివెన్నెల

    By Bojja Kumar
    |

    దర్శకుడు త్రివిక్రమ్ మీద తనకు అప్పుడప్పుడు కోపం వస్తుందని ప్రముఖ సినీ గేయరచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి వ్యాఖ్యానించారు. 'అజ్ఞాతవాసి' సినిమా ప్రమోషన్లో భాగంగా ఈ చిత్రానికి పాటలు రాసిన సిరివెన్నెల, శ్రీమణి సినిమాలోని సాహిత్యంపై చిన్నపాటి చర్చాకార్యక్రమం పెట్టుకున్నారు. ఈ క్రమంలో సిరివెన్నెల ఈ చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ ప్రస్తావన తెచ్చారు.

     త్రివిక్రమ్‌తో పని చేయడం గురించి

    త్రివిక్రమ్‌తో పని చేయడం గురించి

    త్రివిక్రమ్‌ లాంటి దర్శకుడితో పని చేస్తున్నపుడు చాలెంజ్ అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎందుకంటే త్రివిక్రమ్ కు స్వతహాగా పాటలు రాయడం కూడా వచ్చు. కొన్ని సినిమాలకు రాశాడు కూడా. అతడు మంచి రచయిత. రాయగలిగి ఉండి కూడా అలాంటి వారు కావాలనే ఛాలెంజెస్ పెడతారు. రచయిత లోపల నుండి ఇంకేదో తీసుకొద్దామనే తపన అతడిలో ఉంటుంది... అని సిరివెన్నెల తెలిపారు.

     కొత్త దారిలో వెళ్లాలని చూస్తాడు

    కొత్త దారిలో వెళ్లాలని చూస్తాడు

    కథ చెబుతున్నపుడు పాటల విషయంలో ఏదో ఫ్రెష్‌నెస్ ఇద్దామనుకుంటాడు. నలుగురు వెళ్లిన నలిగిన దారిలో వెళ్లేది ఒకరు. కొత్త దారిని క్రియేట్ చేసేది ఒకరు.... అలాంటి వాడు త్రివిక్రమ్ అని సిరివెన్నెల తెలిపారు.

     బాగులేదు అని ఎప్పుడూ అనడు

    బాగులేదు అని ఎప్పుడూ అనడు

    నేను ఏదైనా పాట రాస్తే ఇది బాగులేదు అని త్రివిక్రమ్ ఎప్పుడూ అనడు. అది అతడిలో ఉన్న మంచి గుణం. బావుంది కానీ ఇంకోటి రాయండి అంటాడు. బావుంది అనడంతో పాటు ఎందుకు బావుంది అని చెబుతూ మనలో ఉత్సాహం నింపుతాడు.. అని సిరివెన్నెల తెలిపారు.

     త్రివిక్రమ్ మీద కోపం వస్తుంది

    త్రివిక్రమ్ మీద కోపం వస్తుంది

    అప్పుడప్పుడు త్రివిక్రమ్ మీద కోపం వస్తుంది. నీలాంటి (శ్రీమణి) వారికి ఇచ్చే ఫీడ్ బ్యాక్ నాకు ఇవ్వడు. వారి లాగే నాకు కూడా మాట సాయం చేయొచ్చు కదా అని అడుగుతాను, దానికి అతడు.. ‘మీరున్నపుడు కూడా నేను పాటకు ఎందుకు శ్రమపడాలి? ఎడిటింగో.. మరో పనో చేసుకుంటాను అంటాడు' అని సిరివెన్నెల చెప్పారు.

     సమన్వయం చాలా కష్టం

    సమన్వయం చాలా కష్టం

    అజ్ఞాతవాసి లాంటి పెద్ద సినిమాలు తక్కువ సమయంలో చేయాలంటే చాలా కష్టం. పైగా ఇపుడు టెక్నాలజీ బాగా మారిపోయింది. సంగీతం చేసేవాడు ఎక్కడో ఉంటాడు, మనం ఇంకో దేశంలో ఉంటాం. పాడేవారు వేరే దేశం నుండి వస్తారు. ఈ సమన్వయం చాలా కష్టం.... అని సిరివెన్నెల అన్నారు.

     అజ్ఞాతవాసి

    అజ్ఞాతవాసి

    త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన ‘అజ్ఞాతవాసి' చిత్రం జనవరి 10న గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.

    English summary
    Lyricist Sirivennela Seetharama Sastry Making Super Fun About Trivikram Srinivas about Agnyaathavaasi movie. The film ft. Pawan Kalyan, Keerthy Suresh / Keerthi Suresh & Anu Emmanuel. Directed by Trivikram Srinivas. Produced by S Radha Krishna (Chinna Babu) on Haarika & Haasine Creations banner. Music by Anirudh Ravichander.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X