Sirivennela no more: గుండె ముక్కలైంది.. విలువల శిఖరం సిరివెన్నెల.. వైఎస్ జగన్, సినీ ప్రముఖల సంతాపం
టాలీవుడ్‌లో లెజెండరీ లిరిక్ రైటర్, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇకలేరు. న్యూమోనియా, క్యాన్సర్ వ్యాధి సంబంధింత సమస్యలతో మంగళవారం ఆయన కిమ్స్ హాస్పిటల్‌లో మరణించారు. ఆయన మరణవార్తతో సినీ పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొంటూ ఏపీ సీఎం జగన్, ఇతర సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో సంతాపం తెలిపారు. ఆయనకు సంతాపం తెలిపిన వారిలో..
ఏపీ సీఎం వైఎస్ జగన్ సంతాపం
తెలుగు సినీ గేయ ప్రపంచంలో విలువల శిఖరం సిరివెన్నెల. అక్షరాలతో ఆయన చేసిన భావ విన్యాసాలు తెలుగువారి చరిత్రలో ఎప్పటికీ చిరంజీవులు. ఆయన హఠాన్మరణం మొత్తంగా తెలుగువారికి తీరనిలోటు. సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.
జీర్ణించుకోలేకపోతున్నా.. శ్రీవిష్ణు ట్వీట్
సినీ ప్రపంచానికి అత్యంత విషాదకరమైన రోజు. ఈ వార్తతో నేను షాక్ గురయ్యాను. లెజెండరీ గేయ రచయిత ఇకలేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని శ్రీవిష్ణు ట్వీట్ చేశారు.
చిరకాలం సిరివెన్నెలపాటు గుర్తుండిపోతాయి..
సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణవార్తతో తీవ్ర విషాదంలో మునిగిపోయాను. నా కెరీర్ ఆరంభం నుంచి ఆయనతో అనుబంధం ఉంది. ఆయన సాహిత్యంతో పాటలకు చిరకాలం గుర్తుండిపోతాయి. ఆయన ఆత్మకు శాంతి కలుగజేయాలని భగవంతుడిని కోరుకొంటాను అని నటుడు అల్లరి నరేష్ ట్వీట్ చేశారు.
సిరివెన్నెల లేని లోటు పూడ్చలేనిది
లెజెండరీ గేయ రచయిత శ్రీ సిరివెన్నెల సీతారామాశాస్త్రి మరణ వార్తతో తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యాను. ఆయన మృతి విషాదంలో మునిగిపోయాను. తెలుగు సినిమాకు తీరని లోటు. మీరు లేని లోటు ఎవరూ పూడ్చలేరు. పాట ఉన్నంత కాలం మిమ్నల్ని గుర్తుంచుకొంటాం అని దర్శకుడు బాబీ ట్వీట్ చేశారు.
గుండె ముక్కలైంది అంటూ
సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇకలేరనే వార్తతో గుండె ముక్కలైంది. విభిన్నమైన పాటలకు సాహిత్యాన్ని అందించి తెలుగు సినీ సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. టాలీవుడ్‌లో ఆయన నిజమైన లెజెండ్. ఆయనతో ఉన్న అనుబంధం మరువలేనిది. ఇలాంటి సమయంలో ఆయన కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని దర్శకుడు శ్రీనువైట్ల ట్వీట్‌లో పేర్కొన్నారు.
సీతారామశాస్త్రి మరణంతో దు:ఖంలో మునిగిపోయాను
సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణంతో దు:ఖంలో మునిగిపోయాను. తెలుగు సినిమాకు ఆయన అందించిన సేవలు వెలకట్టలేనివి. మీ ఆత్మకు శాంతి కలుగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అంటూ హీరో రవితేజ ట్వీట్ చేశారు.
ఆత్మకు శాంతి కలుగాలి అంటూ హీరో రామ్ పోతినేని
సినీ పరిశ్రమకు మీరు అందించిన విశేష సాహిత్య సేవలకు ధన్యవాదాలు. సినీ సాహిత్యానికి మీరు అందించిన సేవలను సినీ ప్రపంచం ఎల్లప్పుడు గుర్తుంచుకొంటుంది. మీలాంటి వ్యక్తితో అనుబంధం ఉన్నందుకు, మీతో కలిసి పనిచేసినందుకు గర్వ పడుతాను. మీ ఆత్మకు శాంతి కలుగాలి అంటూ హీరో రామ్ పోతినేని ట్వీట్ చేశారు.
Recommended Video
ఆచార్య సెలవు అంటూ
బళ్లో నేర్చుకున్న పాఠాల కంటే మీ పాటలు వింటూ పొందిన స్ఫూర్తి, చైతన్యం ఎప్పుడూ నాతో పాటుంటాయి... నన్ను నడిపిస్తుంటాయి. మీరు లేరనే నిజాన్ని తట్టుకునే ధైర్యం కూడా మీ పాటలే ఇస్తాయి. సెలవు ఆచార్య..


Click it and Unblock the Notifications











