స్పేస్ తీసుకున్నా అని త్రివిక్రమ్ అన్నారు.. ఇంటర్‌నెట్‌లోని దరిద్రాలన్నీ చెప్పిన సిరివెన్నెల!

దిగ్గజ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. దశాబ్దాల కాలంగా ఎన్నో చిత్రాలకు సిరివెన్నెల అద్భుతమైన పాటలని అందించారు. అచ్చతెలుగులో. లోతైన భావంతో పాటలు రాయగలగడం సిరివెన్నెల ప్రత్యేకత. ఇప్పటికి సిరివెన్నెల తనదైన శైలిలో పాటలు అందిస్తూ అలరిస్తున్నారు. కెవి మహదేవన్, చక్రవర్తి కాలం నుంచి ఇప్పటి దేవిశ్రీ ప్రసాద్, తమన్ వరకు అనేక మంది సంగీత దర్శకులతో సిరివెన్నెల పనిచేసారు. తనకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించిన సందర్భంగా సిరివెన్నెల అనేక విషయాలని మీడియాతో పంచుకున్నారు.

సెలెబ్రిటీల అభినందనలు

సెలెబ్రిటీల అభినందనలు

మెగాస్టార్ చిరంజీవి, మా అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా, సాయి మాధవ్ బుర్రా, ఆర్పీ పట్నాయక్ ఇలా చాల మంది ప్రముఖులు సిరివెన్నెల పద్మశ్రీ ప్రకటించిన సందర్భంగా అభినందనలు తెలియజేశారు. చిరు స్వయంగా సిరివెన్నెల నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు. కాసేపు వీరిద్దరూ ముచ్చటించుకున్నారు. సిరివెన్నెల ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి చిత్రానికి కూడా పాటలు రాస్తున్నారు.

త్రివిక్రమ్ మాట

త్రివిక్రమ్ మాట

సిరివెన్నెల మీడియా సమావేశంలో మాట్లాడుతూ గతంలో త్రివిక్రమ్ అన్న మాటలని గుర్తు చేసుకున్నారు. తాను వీలు కుదరని చోట కూడా స్పేస్ తీసుకుని పాటలు రాస్తానని త్రివిక్రమ్ అన్నారు. ప్రతి రచయిత స్పేస్ తీసుకుని రాయాల్సిందే అని సిరివెన్నెల అభిప్రాయపడ్డారు. దర్శకుడు ఎం కావాలో చెబుతాడు. ఎలా కావాలో తెలిస్తే అతడే పాటలు కూడా రాసేసుకుంటాడు. దర్శకుడు చెప్పింది అర్థం చేసుకుని ఎవరిశైలిలో వాళ్ళు పాటలు రాయాలి అని సిరివెన్నెల అన్నారు.

ఇటాలియన్‌లో రాస్తే

ఇటాలియన్‌లో రాస్తే

ఓ చిత్రంలో తాను ఎకిమీడా అనే పదం వాడాను. తెలుగువాళ్ళకు ఆ పదం అర్థం కాదు అని చాలా మంది అన్నారు. తెలుగు వాళ్లకు అర్థం కాకపోవడం ఏంటి.. అది తెలుగు పదమే అని చెప్పాను. అదే కనుక ఇటాలియన్ పదాన్ని ఉపయోగిస్తే అద్భుతంగా రాశారు అని ప్రశంసించే వారేమో అంటూ సిరివెన్నెల ఎద్దేవా చేశారు.తెలుగు భాష మళ్ళీ వర్ధిల్లే రోజులు వస్తాయని సిరివెన్నెల ఆశాభావం వ్యక్తం చేశారు.

చిరిగిన దుస్తులు

చిరిగిన దుస్తులు

సిరివెన్నెల మాట్లాడుతూ.. టెక్నాలజీ, ట్రెండ్ పేరుతో అవలంభిస్తున్న వింత పోకడల గురించి సెటైర్లు పేల్చారు. పాత రోజుల్లో చిరిగిన దుస్తులు వేసుకుంటే దరిద్రుడు అని పిలిచేవారు. ఇప్పుడు అందరు చిరిగిన బట్టలే వేసుకుంటున్నారు. దుస్తులు బాగున్నా సరే చించి మరి వేసుకుని ఫ్యాషన్ అంటున్నారు అని సిరివెన్నెల అన్నారు.

 ఇంటర్నెట్ అంటేనే దరిద్రం

ఇంటర్నెట్ అంటేనే దరిద్రం

ఇంటర్నెట్ గురించి సిరివెన్నెల మాట్లాడుతూ అందులో ప్రతి పదం అమంగళకరమే అని అన్నారు. ఇంటర్నెట్ అంటే అంతర్జాలం. కంప్యూటర్స్ కి వాడే మౌస్ అంటే ఎలుక. వెబ్ అంటే సాలెగూడు, సెల్ అంటే ఖైదీలని బంధించే గది. కానీ మనమంతా ఇప్పుడు సెల్ ఫోన్స్ కి బందీలుగా మారిపోతున్నాం అని సిరివెన్నెల అన్నారు. ఈ టెక్నాలజీలో ఉండే ఒకే ఒక గొప్ప మాట మదర్ బోర్డు అని సిరివెన్నెల అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X