సిరివెన్నెల సీతారామ శాస్త్రి కుమారుడి నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్
ప్రస్తుతం టాలీవుడ్‌లో పెళ్లి కళ సంతరించకుంది. లాక్ డౌన్ ఉన్నా కూడా పెళ్లిళ్లు జరుగుతూనే ఉన్నాయి. ఇక రీసెంట్‌గా రానా పెళ్లి వేడుకులు, నిహారిక నిశ్చితార్థపు ఈవెంట్ ఎంత ఘనంగా జరిగాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ క్రమంలోనే మరో నటుడికి నిశ్చితార్థం జరిగింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి కుమారుడు రాజా చెంబోలు ఓ ఇంటి వాడు కాబోతోన్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి.
ఫిదాలో వరుణ్ తేజ్ సోదరుడిగా, ఏబీసీడీ సినిమాలో అల్లు శిరీష్‌తో తలపడే విలన్‌గా రాజా తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితుడు. మిస్టర్ మజ్ను, అంతరిక్షం వంటి సినిమాలతో తనకంటూ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ లాక్ డౌన్ సమయం రాజాకు బాగానే కలిసివచ్చినట్టుంది. నిశ్చితార్థం జరిగిందని చెబుతూ.. సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ తెగ హల్చల్ చేస్తోంది.

సిరివెన్నెల సీతారామశాస్త్రి కుమారుడు ఇప్పుడు జీవితంలో మరో కొత్త దశలోకి కూడా ఎంటరవుతున్నాడు. ఆగస్టు 13న రాజా నిశ్చితార్థం సింపుల్ అండ్ స్వీట్ గా జరిగింది. ఐతే ఈ విషయాన్ని లేట్ గా షేర్ చేశాడు.

తన కాబోయే జీవిత భాగస్వామితో దిగిన ఎంగేజ్ మెంట్ ఫొటోల్ని షేర్ చేశాడు. '2020లో అతిగొప్ప విషయం.. కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నా.. మీ అందరి ప్రేమ, అభిమానాలకు థ్యాంక్స్' అంటూ కాబోయే శ్రీమతిని అందరికీ పరిచయం చేశాడు.


Click it and Unblock the Notifications











