twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సిరివెన్నెల సీతారామ శాస్త్రి కి చెంపదెబ్బ

    |

    చేంబోలు సీతారామ శాస్త్రి కన్నా ఆయన్ని సిరివెన్నెల సీతారామశాస్త్రి గానే గుర్తిస్తారు అభిమానులు. కళా తపస్వి విశ్వనాద్ దర్శకత్వంలో 'సిరి వెన్నెల' సినిమాతో మొదటిసారిగా తన కలాన్ని తెలుగు సినిమా ప్రపంచంతో పంచుకున్న సీతారామ శాస్త్రి ఆ సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు.మూడు వేలకు పైగా పాటలు , పది నంది అవార్డు లు, మూడు ఫిలిం ఫేర్ అవార్డు లు.అత్యంత అద్భుతము గా రాయడమే కాకుండా , అత్యధిక పారితోషిక గౌరవాన్ని దక్కించుకున్న ఘనత కూడా శాస్త్రి గారిదే. అయితే ఇంతటి పెద్ద మనిషీ కూడా చెంపదెబ్బలు తిన్నారట. అయితే ఇప్పుడు కాదులెండి చిన్నపుడే. మనకంటే ఆయన గొప్ప మనిషి గానీ వాళ్ళ నాన్నగారికి కాదు కదా....

    తన జీవితంలో జరిగిన ఓ సంఘటన గురించి ఆయన ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆయన తండ్రి ఓ రోజు కొట్టారట. దానికి కారణమేంటో ఆయన మాటల్లోనే చదువుదాం.. వాస్తవానికి మహాత్ముడంటే సత్యం, అహింసకు మారుపేరు. గాంధీ జయంతి సందర్భంగా ఆ మహాత్ముడి ప్రభావం తన కుటుంబంపై ఎలా ఉండేది? దాని వల్ల ఆయన ఎందుకు దెబ్బలు తినాల్సి వచ్చిందో వివరించారు. ''మా నాన్న గారికి గాంధీజీ అంటే అమితమైన ఇష్టం. అభిమానం. ఆయనకు అబద్ధం చెబితే పట్టరాని కోపం వచ్చేస్తుంది.

    Sirivennela Sitarama Sastry Slapped by his Father

    కానీ, చేసిన తప్పును ఒప్పుకొని నిజం చెబితే క్షమించేసేవారు. కాబట్టి అబద్ధం చెప్పి తల దించుకునే కన్నా.. నిజం చెప్పి తల ఎత్తుకుని నిలబడడమే బాగుండనిపించింది. ఐతే ఒకసారి నిజం చెప్పినా మా నాన్న నన్ను కొట్టారు. నేను స్కూల్లో మంచి మార్కులు సంపాదించేవాడిని. బాగా చదివేవాడిని. మా ఉపాధ్యాయుడొకరికి బాగా సినిమాలు చూడడం అలవాటు. ఓ సారి తనతో పాటు నేనూ సినిమా చూసేందుకు వెళ్లాను. ఆ రోజు మా ఇంటికి చుట్టాలు రావడంతో నేను వచ్చేదానికన్నా ముందే నాన్న ఇంటికొచ్చేశారు.

    నేను ఇంటికెళ్లాక ఎక్కడికెళ్లావ్ అని మా నాన్న అడిగితే మాస్టారుతో కలిసి సినిమాకు వెళ్లానని చెప్పా. అంతే.. అబద్ధం చెబుతావా అంటూ నా చెంప మీద లాగి కొట్టారు. నిజం చెబుతున్నా అని చెప్పినా వినిపించుకోలేదు. నా జీవితంలో మా నాన్న నన్ను కొట్టింది ఆ ఒక్కసారే. ఇక, ఆ మరుసటి రోజు ఆదివారం కావడంతో.. మా టీచర్ కోసం సైకిల్ వేసుకుని వెతికారు. ఊరంతా తిరిగాక ఆయన కనిపించారు. ఆయన్ను కలిసి మాట్లాడడంతో నాన్నకు నిజం తెలిసింది. నేను చెప్పింది నిజం అని నమ్మడంతో.. ఇంటికి వచ్చాక అంతపెద్దవారైనా నాకు 'సారీ' చెప్పారు'' అంటూ ఆ నాటి సంఘటనను గుర్తుచేసుకున్నారు సిరివెన్నెల సీతారామశాస్త్రి.

    English summary
    Chembolu Seetharama Sastry (popularly known as Sirivennela Seetharama Sastry) is an Indian lyricist known for his works in Telugu cinema. shared chiledhood memory that Sastry was slapped by his father
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X