For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Sirivennela కోసం కదిలిన మహేశ్, బన్నీ: మా అధ్యక్షుడు మంచు విష్ణు అందుకే రాలేదట

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో కొంత కాలంగా వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మధ్య కాలంలోనే ఎంతో మంది సినీ ప్రముఖులు పలు కారణాలతో ప్రాణాలను కోల్పోయారు. ఇలా కొద్ది రోజుల వ్యవధిలోనే పరిశ్రమ దిగ్గజాలను కోల్పోతూ వస్తోంది. ఈ క్రమంలోనే తన కలంతో ఎన్నో అద్భుతమైన పాటలను రాసిన దిగ్గజ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మంగళవారం మరణించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన పార్థీవదేహాన్ని ఫిలిం చాంబర్‌లో ప్రజల సందర్శనార్థం ఉంచారు.

  ఈ నేపథ్యంలో టాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులంతా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే మహేశ్, అల్లు అర్జున్ సహా ఎంతో మంది అక్కడకు చేరుకున్నారు. కానీ, మంచు విష్ణు రాలేదు. అసలేం జరిగిందో చూద్దాం పదండి!

  ఫిలిం చాంబర్‌కు సినీ ప్రముఖులు

  ఫిలిం చాంబర్‌కు సినీ ప్రముఖులు

  దాదాపు మూడు దశాబ్దాలుగా తన పాటలతో ప్రేక్షకులను అలరించడంతో పాటు చైతన్య పరుస్తూ వచ్చిన లెజెండ్ సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఇప్పుడు ఆయన పార్థీవదేహాన్ని ప్రజలు, సినీ ప్రముఖుల సందర్శనార్థం హైదరాబాద్‌లోని ఫిలిం చాంబర్‌లో ఉంచారు. దీంతో అక్కడకు సినీ ప్రముఖులు, అభిమానులు భారీగా తరలి వస్తున్నారు.

  Janhvi Kapoor: బటన్స్ విప్పేసి రచ్చ చేసిన జాన్వీ కపూర్.. ముందుకు వంగి మరీ అందాల జాతర

  అనుబంధాన్ని పంచుంటున్నారు

  అనుబంధాన్ని పంచుంటున్నారు

  సిరివెన్నెల సీతారామశాస్త్రితో తమకు ఉన్న అనుబంధాన్ని సినీ ప్రముఖులంతా నెమరువేసుకుంటున్నారు. ఒక్కొక్కరుగా ఫిలిం చాంబర్‌కు చేరుకుంటోన్న స్టార్ హీరోలు, హీరోయిన్లు, సింగర్లు, డైరెక్టర్లు, నిర్మాతలతో పాటు ఇతర టెక్నీషియన్లు ఆయన గొప్పదనాన్ని వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది ఆయన మరణంపై స్పందిస్తూ కన్నీరుమున్నీరు అవుతున్నారు.

   ఇప్పటి వరకూ వచ్చిన వాళ్లు వీళ్లే

  ఇప్పటి వరకూ వచ్చిన వాళ్లు వీళ్లే


  సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థీవ దేహానికి నివాళులు అర్పించేందుకు ప్రముఖులంతా ఒక్కొక్కరుగా చాంబర్‌కు తరలి వస్తున్నారు. ఇప్పటి వరకూ నందమూరి బాలకృష్ణ, వెంకటేష్, జగపతిబాబు, థమన్, సునీత, అల్లు అరవింద్, అల్లు అర్జున్, తణికెళ్ల భరణి, పరుచూరి గోపాలకృష్ణ, సాయి కుమార్, మారుతి, ఎస్వీ కృష్ణారెడ్డితో పాటు పలువురు మంత్రులు కూడా వచ్చారు.

  బ్రా కూడా లేని వీడియోతో షాకిచ్చిన పాయల్ రాజ్‌పుత్: ప్రైవేటు పార్టులు చూపిస్తూ దారుణంగా!

  ఆ పాటే గుర్తుకు వస్తుందన్న నాగ్

  ఆ పాటే గుర్తుకు వస్తుందన్న నాగ్

  కొద్దిసేపటి క్రితమే సిరివెన్నెల భౌతిక కాయాన్ని అక్కినేని నాగార్జున సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం 'సిరివెన్నెల అంటే తెలుసా మనసా అనే పాట గుర్తు వస్తుంది. ఆయన రాసే పాటలు.. చెప్పే మాటలే కాదు మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. స్వర్గానికి వెళ్లి దేవుళ్లకు కూడా ఇదే మాటలు, పాటలూ వినిపిస్తూ ఉంటారు' అంటూ మీడియా ముందు చెప్పారు నాగార్జున.

  తెలుగు పాటలు ఎలా ఉంటాయో

  తెలుగు పాటలు ఎలా ఉంటాయో

  సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతిక కాయానికి సూపర్ స్టార్ మహేశ్ బాబు కొద్ది సేపటి క్రితమే ఫిలిం చాంబర్ వద్ద నివాళులర్పించాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 'సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు లేకుండా తెలుగు పాటలు ఎలా ఉండబోతున్నాయనేది ఊహించడానికే కష్టంగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా' అని చెప్పుకొచ్చాడు.

  ప్యాంట్ లేకుండా షాకిచ్చిన అనన్య నాగళ్ల: సినిమాల్లో నిండుగా.. ఇక్కడ మాత్రం అరాచకంగా!

  Recommended Video

  Siri Hanmanth : ఆదర్శంగా నిలిచిన Bigg Boss బ్యూటీ.. పెళ్లి కాకుండానే తల్లిగా || Filmibeat Telugu
  విష్ణు రాకపోడానికి కారణం ఇదేనట

  విష్ణు రాకపోడానికి కారణం ఇదేనట

  సీనియర్ యాక్టర్ నరేష్.. సిరివెన్నెలకు నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. 'తెలుగు సినీ పరిశ్రమకు బాలుగారూ, సిరివెన్నెల గారూ రెండు రధచక్రాలు. వాళ్లను మనం కోల్పోయాం. ఈయన మరణంతో సమురు లేని దీపం కుండలా సినీ పరిశ్రమ మిగిలిపోయింది. మంచు విష్ణు తన బాబాయ్‌ కర్మకు వెళ్లారు. అందుకే రాలేదు' అని ఆయన వెల్లడించారు.

  English summary
  Tollywood Senior Writter Sirivennela Sitaramasastri Died Tuesday. Now Allu Arjun, Mahesh Babu and Other Celebrities pays tribute to Him.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X