డైరెక్టర్ అవ్వకముందే త్రివిక్రమ్ ను అల్లుడిగా చేసుకున్న సిరివెన్నెల.. అతనంటే అంత నమ్మకం!

సిరివెన్నెల సీతారామశాస్త్రి హఠాత్తుగా మరణించడం సినిమా ఇండస్ట్రీని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది. వేలాది పాటలను రచించి వందలాది సినిమాలకు పనిచేసిన సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన గౌరవం. చిన్న హీరో నుంచి అగ్రహీరో వరకు అందరు కూడా ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటారు. పాటలతోనే సీతారామశాస్త్రి ఎనలేని కీర్తిని అందుకున్నారు. మంగళవారం సాయంత్రం ఆయన హఠాత్తుగా మరణించడంతో సినీ ప్రపంచంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక సోషల్ మీడియాలో కూడా అభిమానులు ప్రత్యేకంగా నివాళులు అర్పిస్తున్నారు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి కి ప్రత్యేకమైన బంధువు అని చాలా మందికి తెలియదు.

ఎలాంటి పాట రాసిన కూడా..

ఎలాంటి పాట రాసిన కూడా..


సిరివెన్నెల సీతారామశాస్త్రి ఎలాంటి పాట రాసిన కూడా అన్ని వర్గాల వారికి నచ్చే విధంగా ఉండాలని రచిస్తారు. అంతేకాకుండా ఆయన ఏదైనా కొత్త తరహా పదాలు రాస్తే కూడా వాటి గురించి తెలుసుకోవాలి అని నేటి తరం యువత కూడా ఎంతో ఆసక్తిగా చూస్తారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి తో పాటలు రాయించుకోవడం కోసం చాలా మంది అగ్ర దర్శకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు.

త్రివిక్రమ్ తో అనుబంధం

త్రివిక్రమ్ తో అనుబంధం

అంతే కాకుండా అగ్ర హీరోలు కూడా ఏదైనా ఒక సందర్భంలో సిరివెన్నెల గారితో మంచి పాట రాయించు కోవాలి అని సంగీత దర్శకులకు ప్రత్యేకంగా చెబుతారు. ఇక టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో త్రివిక్రమ్ శ్రీనివాస్ తన ప్రతి సినిమాలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారితో ఒక్క పాట అయినా సరే తీసుకుంటా ఉంటారు. ఆ దర్శకుడితో సిరివెన్నెల కు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది.

ఆ ఇంటికి అల్లుడిగా

ఆ ఇంటికి అల్లుడిగా

త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయితగా తన సత్తాను చాటుకున్న సందర్భంలోనే సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి చాలా దగ్గరయ్యాడు. అతను తప్పకుండా మంచి దర్శకుడు అవుతాడని అందరికంటే ఎక్కువగా సిరివెన్నెల సీతారామశాస్త్రి నమ్మినట్లు ఇండస్ట్రీ లో అందరికీ తెలిసిన విషయమే. అయితే త్రివిక్రమ్ ను అల్లుడు గా చేసుకోవాలని ఆయన అనుకున్నారు. తన తమ్ముడి కూతురు సౌజన్యను త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఇచ్చి పెళ్లి చేశారు.

 ఒక శిష్యుడిగా..

ఒక శిష్యుడిగా..


స్వయంవరం సినిమాతో రచయితగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టిన త్రివిక్రమ్ శ్రీనివాస్ మూడేళ్ల వరకు రచయితగా వరుస విజయాలను అందుకున్నారు. ఇక 2002లో నువ్వే నువ్వే సినిమా ద్వారా దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అయితే అంతకంటే ముందుగానే సిరివెన్నెల సీతారామశాస్త్రి అతనిలోని ప్రతిభను గుర్తించారు. అంతేకాకుండా అతని తెలివితేటల్లో మంచితనం చూసి తన ఇంట్లోకి అల్లుడిగా ఆహ్వానించారు. వరుసకు సిరివెన్నెల మామగారు అయినప్పటికీ కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ గురువుగారు అంటూ ఒక శిష్యుడు తరహాలోనే గౌరవంతో ఉంటారు.

Recommended Video

Sirivennela Seetharama Sastry Garu మూగబోయిన సిరివెన్నెల || Filmibeat Telugu
మూడు వేల పాటలు

మూడు వేల పాటలు

సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణంతో ఇండస్ట్రీలోని ప్రముఖులు అందరు కూడా ఒక్కసారిగా షాకయ్యారు. దాదాపు 800 సినిమాలకు పనిచేసిన సిరివెన్నెల సీతారామశాస్త్రి మూడు వేలకు పైగా పాటలు కూడా రాశారు. సిరివెన్నెల సినిమాతో ఆయన ఇంటిపేరు కూడా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గా మారిపోయింది. ఇక చివరగా సీతారామశాస్త్రిగారు నాని శ్యామ్ సింగరాయ్ సినిమాకు రెండు పాటలను అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X