twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహానటి ఆడియో లాంచ్: మహానటి ఒక్కరే, రెండు ఎవరెస్టులు లేవు.. సిరివెన్నెల!

    |

    భారతీయ చలన చిత్ర రంగంలో దిగ్గజ నటి సావిత్రికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందరో నటులకు ఆదర్శం ఆమె. నటిగా తిరుగులేని ఖ్యాతిని గడించిన సావిత్రి జీవితానికి సంబందించిన ఎన్నో మధురమైన విషయాలు, చేదు జ్ఞాపకాలు ఉన్నాయి. ఆమె జీవితం గురించి పూర్తిగా అభిమానులకు తెలియదు. సావిత్రి బయోపిక్ గా రూపొందుతున్న మహానటి చిత్రం ద్వారా సావిత్రి జీవితానికి సంబంధించిన అనేక విషయాలని దర్శకుడు నాగ అశ్విన్ ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ చిత్ర ఆడియో వేడుక నేడు జరగబోతోంది. ఈ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరవుతుండడం విశేషం. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, సమంత, విజయ దేవర కొండా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కొద్ది సేపటి క్రితమే ఆడియో వేడుక ప్రారంభమైంది.

     Sirivennela Sitaramasastri Speech at MahaNati Audio launch event

    ఈ చిత్రానికి దిగ్గజ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు. ఆయన మాట్లాడుతూ మహానటి అంటే సావిత్రి మాత్రమే అని అన్నారు. రెండు ఎవరెస్టులు ఉండవు. సావిత్రి గారి జీవితం 75 శాతం నటిగానే సాగిందని ఆయన అన్నారు. సావిత్రి గారి జీవితం తెరచిన పుస్తకం. ఇలాంటి చిత్రాన్ని తీయాలంటే కత్తిమీద సాము లాంటి పని. ఆ పనిని నాగ అశ్విన్ అద్భుతంగా నెరవేర్చారని అన్నారు.

    సావిత్రి జీవితం విషాదాంతం అంటే తాను ఒప్పుకోనని అన్నారు. ఆమె సాధించిన ఖ్యాతి ద్వారా ఇప్పటికి జీవించే ఉన్నారని శాస్త్రి అన్నారు. సావిత్రి చనిపోవాలి అంటే మనం మాయాబజార్, కన్యాశుల్కం వంటి చిత్రాలని మర్చిపోవాలి అని అన్నారు. ఈ చిత్ర పాటలకు అందరి హీరోల అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోందని అన్నారు. ఈ చిత్రంలో రామజోగయ్య శాస్త్రి కూడా ఓ పాట రాశారు.

    English summary
    MahaNati Audio launch live updates. NTR is chief guest to the event. Sirivennela Sitaramasastri Speech at MahaNati Audio launch event
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X