చెల్లెలు సెంటిమెంటే 'డార్లింగ్' కి ప్లస్...నిర్మాత
సెకెండాఫ్ లో వచ్చే చెల్లెలు ప్రేమ వ్యవహారం, తండ్రితో మాట్లాడే ఘట్టం ప్రతి ఒక్కరికీ నచ్చుతాయని విశ్వసించాను..ఇప్పుడు ఆ విశ్వాసమే నిజమైంది...అంటున్నారు 'డార్లింగ్' నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్. ఆయన సినిమా ప్రమోషన్ నిమిత్తం హైదరాబాద్ లో మీడియాని కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా 'డార్లింగ్' అనుభవాల్ని ఇలా చెప్పుకొచ్చారు. "మా చిత్రానికి కథే బలం. అందులో ఉన్న వినోదం, సెంటిమెంట్ ప్రతి ఒక్కరికీ నచ్చుతున్నాయి. కరుణాకరన్ చెప్పిన కథ వినగానే ప్రభాస్ తప్పకుండా చేస్తున్నాం అన్నారు. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ప్రభాస్, కాజల్ జోడీ కంటికింపుగా ఉంది. వాళ్ల మధ్య సాగే ప్రేమ సన్నివేశాలు బాగున్నాయని అందరూ చెబుతున్నారు. గతంలో నేను నిర్మించిన 'ఛత్రపతి' కూడా కుటుంబ ప్రేక్షకుల్ని ఆకట్టుకొంది. అందులోని మదర్ సెంటిమెంట్ అందరికీ నచ్చింది. ఇందులో చెల్లెలు సెంటిమెంట్ ఉంది. ఏ కథలో అయినా వినోదంతోపాటు కొంత భావోద్వేగం కూడా ఉండాలి. అప్పుడే అన్ని వయసులవాళ్లనీ ఆకట్టుకోగలం" అన్నారు. తదుపరి చిత్రానికి సంబంధించిన వివరాలు కొద్ది రోజుల్లో చెబుతామన్నారు.


Click it and Unblock the Notifications











