twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రీమియర్ షోతో సీత ఏం మెసేజ్ ఇస్తోందంటే.. 'సీత'పై జనం టాక్

    |

    తేజ దర్శకత్వంలో ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సీత సినిమా రూపుదిద్దుకుంది. చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మన్నారా చోప్రా హీరోహీరోయిన్లుగా నటించగా సోను సూద్, తనికెళ్ళ భరణి కీలక పాత్రలు పోషించారు. ఓ రేంజ్ అంచనాల నడుమ మే 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా విదేశాల్లో ఇప్పటికే ప్రీమియర్ షోస్ పడటంతో సీత పై జనాల మాట ఎలా ఉందో చూద్దామా..

    ఆసక్తికర కథాంశం

    ఆసక్తికర కథాంశం

    సీత చూసిన వారు మొదట చెబుతున్న మాట.. ఆసక్తికర కథాంశం. తేజ తన మార్క్ చూపిస్తూ చిత్రీకరించబడిన ఈ కథలో కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయని అంటున్నారు. చిన్నప్పటి నుంచి జనాలకు దూరంగా పెరిగిన ఓ వ్యక్తి, డబ్బే లోకం.. డబ్బే సర్వస్వము అని భావించే ఓ అమ్మాయికి ఏర్పడిన పరిచయం చివరకు ఎక్కడికి వెళ్లిందనేదే అసలు కథ.

    కథ అంతా కాజల్ చుట్టే..

    కథ అంతా కాజల్ చుట్టే..

    ముందుగా అందరూ భావించినట్లే ఈ సినిమాలో కాజల్ దే మేజర్ రోల్. మోడ్రెన్ సీతగా కాజల్ ఆకట్టుకుందని, కథ అంతా కాజల్ చుట్టే తిరుగుతుందని అంటున్నారు కొందరు ప్రేక్షకులు. డిఫరెంట్ రోల్ లో ఆమె చూపిన అభినయం ప్రేక్షక లోకాన్ని మెప్పిస్తోందని తెలిసింది. ఇక హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నటన అంతంత మాత్రమే అని తెలుస్తోంది.

    హీరో హీరోయిన్ మినహా ఇతరులు

    హీరో హీరోయిన్ మినహా ఇతరులు

    హీరో హీరోయిన్ మినహా ఇతర క్యారెక్టర్ల విషయానికొస్తే.. విలన్ గా సోనూ సూద్ అదరగొట్టేశాడట. అదేవిధంగా బిత్తిరి సత్తి జోక్స్ కాస్త నవ్వించాయని, ప్రేక్షకులను మెప్పించే క్యారెక్టర్ లో తనికెళ్ళ భరణి దర్శనమిచ్చాడని అంటున్నారు. ఇక పాటలు కూడా పెద్దగా ప్లస్ కాలేదని తెలుస్తోంది.

    ఫస్ట్ హాఫ్ ఓకే.. పాయల్ జిగెల్స్

    ఫస్ట్ హాఫ్ ఓకే.. పాయల్ జిగెల్స్

    సీత ఫస్ట్ హాఫ్ బాగానే ఆకట్టుకుందని, అయితే సెకండ్ హాఫ్ కాస్త బోరింగ్ అనిపించిందని అంటున్నారు. ఇక బుల్లెట్టు మీదొచ్చే బుల్ రెడ్డి సాంగ్ లో పాయల్ రాజ్ పుత్ జిగేల్ అనిపించే అందాలు థియేటర్లను గోల పెట్టించాయని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే సీతపై ప్రేక్షకుల నాడి పాజిటివ్ గానే కనిపిస్తోందని సమాచారం.

    English summary
    Director Teja's upcoming movie 'Sita'. Sai Srinivas Bellamkonda, Kajal Aggarwal playing lead roles in this romantic drama. This movie gets possitive responce on premier show.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X