Don't Miss!
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్‌కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ప్రీమియర్ షోతో సీత ఏం మెసేజ్ ఇస్తోందంటే.. 'సీత'పై జనం టాక్
తేజ దర్శకత్వంలో ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సీత సినిమా రూపుదిద్దుకుంది. చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మన్నారా చోప్రా హీరోహీరోయిన్లుగా నటించగా సోను సూద్, తనికెళ్ళ భరణి కీలక పాత్రలు పోషించారు. ఓ రేంజ్ అంచనాల నడుమ మే 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా విదేశాల్లో ఇప్పటికే ప్రీమియర్ షోస్ పడటంతో సీత పై జనాల మాట ఎలా ఉందో చూద్దామా..
ఆసక్తికర కథాంశం
సీత చూసిన వారు మొదట చెబుతున్న మాట.. ఆసక్తికర కథాంశం. తేజ తన మార్క్ చూపిస్తూ చిత్రీకరించబడిన ఈ కథలో కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయని అంటున్నారు. చిన్నప్పటి నుంచి జనాలకు దూరంగా పెరిగిన ఓ వ్యక్తి, డబ్బే లోకం.. డబ్బే సర్వస్వము అని భావించే ఓ అమ్మాయికి ఏర్పడిన పరిచయం చివరకు ఎక్కడికి వెళ్లిందనేదే అసలు కథ.
కథ అంతా కాజల్ చుట్టే..
ముందుగా అందరూ భావించినట్లే ఈ సినిమాలో కాజల్ దే మేజర్ రోల్. మోడ్రెన్ సీతగా కాజల్ ఆకట్టుకుందని, కథ అంతా కాజల్ చుట్టే తిరుగుతుందని అంటున్నారు కొందరు ప్రేక్షకులు. డిఫరెంట్ రోల్ లో ఆమె చూపిన అభినయం ప్రేక్షక లోకాన్ని మెప్పిస్తోందని తెలిసింది. ఇక హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నటన అంతంత మాత్రమే అని తెలుస్తోంది.
హీరో హీరోయిన్ మినహా ఇతరులు
హీరో హీరోయిన్ మినహా ఇతర క్యారెక్టర్ల విషయానికొస్తే.. విలన్ గా సోనూ సూద్ అదరగొట్టేశాడట. అదేవిధంగా బిత్తిరి సత్తి జోక్స్ కాస్త నవ్వించాయని, ప్రేక్షకులను మెప్పించే క్యారెక్టర్ లో తనికెళ్ళ భరణి దర్శనమిచ్చాడని అంటున్నారు. ఇక పాటలు కూడా పెద్దగా ప్లస్ కాలేదని తెలుస్తోంది.
ఫస్ట్ హాఫ్ ఓకే.. పాయల్ జిగెల్స్
సీత ఫస్ట్ హాఫ్ బాగానే ఆకట్టుకుందని, అయితే సెకండ్ హాఫ్ కాస్త బోరింగ్ అనిపించిందని అంటున్నారు. ఇక బుల్లెట్టు మీదొచ్చే బుల్ రెడ్డి సాంగ్ లో పాయల్ రాజ్ పుత్ జిగేల్ అనిపించే అందాలు థియేటర్లను గోల పెట్టించాయని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే సీతపై ప్రేక్షకుల నాడి పాజిటివ్ గానే కనిపిస్తోందని సమాచారం.