twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మహర్షి’తో పాటు థియేటర్లో సందడి చేయబోతున్న ‘సీత’

    |

    సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా రూపొందుతున్న చిత్రం 'మహర్షి'. మే 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 'మహర్షి'తో పాటు 'సీత' కూడా థియేటర్లో సందడి చేయబోతోంది.

    బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా తేజ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'సీత'. ఈ మూవీకి ప్రచారం కల్పించడంలో భాగంగా 'మహర్షి' ప్రదర్శితం అవుతున్న అన్ని థియేటర్లలో 'సీత' ట్రైలర్ ప్రదర్శించబోతున్నారు. మే 24న ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

    ‘SITA’ movie trailer will screened with ‘Maharshi’ movie

    దర్శకుడు తేజ 'సీత' మూవీని ఒక డిఫరెంట్ జోనర్లో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ పొగరుబోతు బిజినెస్ ఉమెన్ పాత్రలో కనిపించబోతోంది. బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు ఆసక్తికరంగా ఉండబోతున్నాయట.

    ఇప్పటికే విడుదలైన 'సీత' టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 'మహర్షి' మూవీతో పాటు 'సీత' థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేయడం ద్వారా ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.

    'సీత'లో ఇంకా మనారా చోప్రా, సోనూ సూద్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. RX 100 చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన పాయల్ రాజ్ పుత్ 'సీత'లో స్పెషల్ సాంగులో కనిపించబోతోంది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. ఎకె ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

    English summary
    Bellamkonda Sreenivas, Kajal Agarwal ‘SITA’ movie trailer is going to be screened with superstar Mahesh Babu’s ‘Maharshi’ which hitting the theatures May 9 th.‘SITA’ is a different genre movie being directed by Teja, release on May 24th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X