Don't Miss!
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- News విశాఖ లోక్‌సభ పరిధిలో ఆ సామాజిక వర్గందే పెత్తనం..బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా..?
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
‘మహర్షి’తో పాటు థియేటర్లో సందడి చేయబోతున్న ‘సీత’
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా రూపొందుతున్న చిత్రం 'మహర్షి'. మే 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 'మహర్షి'తో పాటు 'సీత' కూడా థియేటర్లో సందడి చేయబోతోంది.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా తేజ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'సీత'. ఈ మూవీకి ప్రచారం కల్పించడంలో భాగంగా 'మహర్షి' ప్రదర్శితం అవుతున్న అన్ని థియేటర్లలో 'సీత' ట్రైలర్ ప్రదర్శించబోతున్నారు. మే 24న ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
దర్శకుడు తేజ 'సీత' మూవీని ఒక డిఫరెంట్ జోనర్లో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ పొగరుబోతు బిజినెస్ ఉమెన్ పాత్రలో కనిపించబోతోంది. బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు ఆసక్తికరంగా ఉండబోతున్నాయట.
ఇప్పటికే విడుదలైన 'సీత' టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 'మహర్షి' మూవీతో పాటు 'సీత' థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేయడం ద్వారా ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.
'సీత'లో ఇంకా మనారా చోప్రా, సోనూ సూద్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. RX 100 చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన పాయల్ రాజ్ పుత్ 'సీత'లో స్పెషల్ సాంగులో కనిపించబోతోంది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.