మహేష్ బాబు కూతురు సితార.. ఫస్ట్ లెవల్ కంప్లీట్!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత దంపతుల ముద్దుల కూతురు సితార మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. కొన్ని రోజులుగా సితార క్లాసికల్ డాన్స్‌లో శిక్షణ తీసుకుంటోంది. ఫస్ట్ లెవల్ పూర్తయిన సందర్భంగా నమ్రత కొన్ని ఫోటోస్ అభిమానులతో పంచుకున్నారు.
ప్రముఖ క్లాసికల్ డాన్స్ ట్రైనర్ అరుణ భిక్షు ఆధ్వర్యంలో సితార డాన్స్ నేర్చుకుంటోంది. ఇటీవలే మొదటి కాలి మువ్వల జోడిని కూడా ఆమెకు కొనిచ్చారట. త్వరలో సితారతో స్కూల్‌లో డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇప్పించబోతున్నారట.

సితారలో ఏ విషయమైనా త్వరగా నేర్చుకోగల సామర్థ్యం ఉండటం చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. భవిష్యత్తులో ఈ స్టార్ కిడ్ సినిమాల్లోకి వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అందుకు తగిన విధంగా ఆమెకు వివిధ అంశాల్లో శిక్షణ ఇప్పిస్తున్నారు.
మహేష్ బాబు తనయుడు గౌతమ్... '1-నేనొక్కడినే' సినిమా ద్వారా బాల నటుడిగా తెరంగ్రేటం చేసిన సంగతి తెలిసిందే. సితారను కూడా బాలనటిగా తెరపై కనిపిస్తే చూడాలిన అభిమానులు ఆశ పడుతున్నారు. మరి వారి కోరిక తీరుతుందో.. లేదో? చూడాలి.


Click it and Unblock the Notifications











