వైరల్ పిక్స్: కుక్కతో మహేష్ కూతురు క్యూట్ ఫోజులు!
సూపర్ స్టార్ మహేష్ ముద్దుల కూతురు సీత సోషల్ మీడియా రాణిగా మారిపోయింది. తన ముద్దులొలికే చేష్టలతో అందరిని ఆకట్టుకుంటోంది. మహేష్ బాబు కూడా వీలు చిక్కినప్పుడల్లా తన కుమార్తెతో ఆడుకోవడానికి ఇష్టపడుతాడు. సితార ఎక్కడ కనిపించినా ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంటాయి.
మరో మారు అదే జరిగింది. సితార తనకు ఇష్టమైన పెంపుడు కుక్కతో ఇస్తున్న ఫోజులు వైరల్ గా మారాయి. కుక్కకు సితార షేక్ హ్యాండ్ ఇస్తుండగా ఆ కుక్క కూడా అంతే ముద్దుగా ఫోజు ఇచ్చింది.

ఇదిలా ఉండగా మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా దిల్ రాజు, అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











