మహేష్ బాబు కూతురు డాన్స్ చేసింది (వీడియో)
హైదరాబాద్: మహేష్ బాబు కూతురు సితార డాన్స్ చేసిన వీడియో ఒకటి ఇపుడు యూట్యూబులో అందరినీ ఆకట్టుకుంటోంది. ఆగడు చిత్రంలోని ‘తూ ఆజా సరోజా' అనే పాటకు కాళ్లు, చేతులు ఊపుతూ సితార సందడి చేసింది. ఇది ఆగడు షూటింగ్ సమయంలో సెల్ ఫోన్ ద్వారా చిత్రీకరించిన వీడియో అని తెలుస్తోంది.
మహేష్ బాబు ముద్దుల కూతురు సితార వయసు ప్రస్తుతం 2 సంవత్సరాలు. మహేష్ బాబు-నమ్రతా శిరోద్కర్ దంపతులకు జులై 20, 2012న సితార జన్మించింది. సితారను తమ ఇంటి మహాలక్ష్మిగా భావిస్తున్నారు మహేష్ కుటుంబ సభ్యులు.

మహేష్ బాబు కూతురు సితార చాలా అల్లరి పిల్ల. ఆమె ఇంట్లో లేక పోతే ఇల్లు మూగబోయినట్లు ఉంటుందట. ఇప్పటికే మహేష్ బాబు తనయుడు గౌతం కృష్ణ ‘1-నేనొక్కడినే' చిత్రం ద్వారా ప్రేక్షకుల వెండి తెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. భవిష్యత్తులో సితార కూడా సినిమాల్లో నటించే అవకాశం ఉంది.
mahesh babu gautam krishna aagadu krishna sitara namrata shirodkar మహేష్ బాబు గౌతం కృష్ణ కృష్ణ సితార నమ్రత శిరోద్కర్


Click it and Unblock the Notifications