మహేష్ కుమార్తె డ్రీమ్ మాములుగా లేదుగా.. డాక్టర్, ఇంజినీర్ కాదట..ఏంటో తెలుసా?

ఘట్టమనేని కృష్ణ వారసుడిగా సినీరంగ ప్రవేశం చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు తిరుగులేని విధంగా తెలుగులో సూపర్ స్టార్ అనిపించుకున్నారు. కృష్ణ వారసులుగా మరికొంతమంది ఎంట్రీ ఇచ్చారు కానీ మహేష్ బాబు మాత్రమే నిలబడ్డారు. ఇప్పుడు మహేష్ బాబు కుమారుడు గౌతమ్ కూడా ఇప్పటికే వన్ నేనొక్కడినే సినిమాలో మహేష్ చిన్నప్పటి పాత్రలో కనిపించి అలరించారు. ఇప్పుడు సర్కారు వారి పాట సినిమాలో మహేష్ కుమార్తె సితార కూడా సినీ రంగ ప్రవేశం చేసింది. పెన్నీ పెన్నీ అంటూ సాగుతున్న పాటలో ఆమె కాలు కలిపి సందడి చేసింది. అయితే ఆ సాంగ్ సినిమాలో ఉంటుందా లేదా అనే విషయం పక్కన పెడితే ఆ పాట ద్వారా సితార కు మంచి పేరు రావడమే గాక సితార ద్వారా పాటకు క్రేజ్ రావడమే కాకుండా సినిమా మీద కూడా అంచనాలు పెంచే విధంగా వైరల్ అయింది.

చిన్న వయసులోనే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే సితార తన తండ్రి కళావతి సాంగ్ విడుదలైన వెంటనే దానికి రీల్స్ కూడా చేసింది. అది కూడా బాగా వైరల్ అయింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఆమె వంశీ పైడిపల్లి కుమార్తె ఆధ్యతో కలిసి ఏకంగా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడమే కాక సరిలేరు నీకెవ్వరు సినిమా సమయంలో తన తండ్రిని ఇంటర్వ్యూ కూడా చేసి ఔరా అనిపించింది.. తాజాగా సర్కారు వారి పాట ప్రమోషన్స్ నేపథ్యంలో ఆమెను కూడా కొన్ని టీవీ ఛానళ్లు ఇంటర్వ్యూ చేశాయి. అందులో భాగంగా మీరు భవిష్యత్తులో ఏం అవ్వాలనుకుంటున్నారు మీ డ్రీమ్ ఏంటి అని అడిగితే నేను డాక్టర్ లేదా ఇంజనీర్ అవ్వాలని అనుకోవడం లేదు ఖచ్చితంగా యాక్టర్ అవ్వాలని అనుకుంటున్నాను అదే నా డ్రీమ్ అని ఆమె కుండ బద్దలు కొట్టేసింది.

Sitara Ghattamaneni opens up about her dream

తండ్రి మహేష్ బాబు హీరో కాగా తన తల్లి కూడా హీరోయిన్ గా మారి తరువాత మహేష్ ను ప్రేమ వివాహం చేసుకుని ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పింది. సితార మాటలను బట్టి చూస్తే ఆమె కూడా ఏదో ఒకరోజు హీరోయిన్ అవ్వక తప్పదు అన్న మాట. నిజానికి కృష్ణ కుటుంబం నుంచి కేవలం మహేష్ బాబు మాత్రమే కాదు తొలుత మహేష్ బాబు కంటే ముందే ఆయన సోదరుడు రమేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కానీ ఆయన ఎక్కువ రోజులు సినిమాలలో కొనసాగలేక పోయారు. తర్వాత మహేష్ సోదరి మంజుల కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు అయితే ఒకటి రెండు సినిమాల తర్వాత ఆమె కూడా నటనకు దూరమయ్యారు. ప్రస్తుతానికి ఆమె కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. కృష్ణ కుటుంబం నుంచి మహేష్ బాబు మరో సోదరి కుమారుడు అశోక్ కూడా హీరోగా మారారు. ఇటీవల ఆయన నటించిన హీరో అనే సినిమా విడుదలై మంచి పేరు తెచ్చుకుంది. ఇక మహేష్ సోదరి భర్త సుధీర్ బాబు కూడా ఒక హీరో అన్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X