తాగి పట్టుబడిన నటుడు, ఈసారి శివబాలాజీ
ఆర్య ఫేమ్ శివ బాలాజి త్రాగి డ్రైవ్ చేస్తూండటంతో ట్రాఫిక్ పోలీస్ వారు పట్టుకుని కేసు బుక్ చేసారు. ఈ సంఘటన.. ఫిల్మ్ నగర్.. భారతీయ విద్యా భవన్ చౌరస్తా వద్ద చోటు చేసుకుంది. పార్టిలో త్రాగి వస్తున్న అతన్ని పోలీసులు ఆపి టెస్ట్ చేసారు. అందులో అతను త్రాగి ఉండటం కనపడతంతో అతనిపై కేసు రాసారు. అయితే శివబాలాజీ.. తనకు ఈ విషయమై ఐడియా లేదని, తాను స్వయంగా డ్రైవ్ చేసుకెళ్లగలననే నమ్మకంతోనే డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నట్లు చెప్పారు. దాంతో అతని పోర్డ్ కారుని సీజ్ చేసి అతనిపై కేసు రాసారు.
ఈ విషయమై బంజారా హిల్స్ ట్రాఫిక్ ఎసిపి కె.ఎమ్ మధు మాట్లాడుతూ శివబాలాజీని చాలా మెచ్చుకున్నారు. అతని జెంటిల్ బిహేవియర్, తప్పు ఒప్పుకోవటాన్ని ఆయన అభినందించారు. అలాగే ఫిలమ్మ నగర్ ఏరియాలో ఇలాంటి సర్పైజ్ విజిట్ లు చేస్తామని తమ టీమ్ లు వీటిపై వర్క్ చేస్తూ.. సడెన్ చెకింగ్ లు చేస్తామని అన్నారు. అలాగే తాము ఈ నాలుగు నెలల్లో సుమారు రెండు వేల ఐదు వందల దాకా ఇలాంటి త్రాగి డ్రైవ్ చేస్తున్న కేసులు బుక్ చేసామన్నారు. క్రిందటి నెలలో నిఖిల్, అంతకుముందు నవదీప్ ఇలాంటి త్రాగి డ్రైవ్ చేసిన కేసుల్లో ఇరుక్కున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











