శివబాలాజీ భార్యకు వేధింపులు.. సైబర్ పోలీసులకు ఫిర్యాదు..
తెలుగు బిగ్‌బాస్ విజేత, సినీ నటుడు శివబాలాజీ భార్య మధుమితకు సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. తన భార్యకు ఈమెయిల్ ద్వారా అసభ్య సందేశాలు పంపిన వ్యక్తులపై శివ బాలాజీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చే
తెలుగు బిగ్‌బాస్ విజేత, సినీ నటుడు శివబాలాజీ భార్య మధుమిత (స్వప్న మాధురి)కి సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. తన భార్యకు ఈమెయిల్ ద్వారా అసభ్య సందేశాలు పంపిన వ్యక్తులపై శివ బాలాజీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శివబాలాజీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Recommended Video


గతంలో శివబాలాజీకి కూడా
గతంలో కూడా నటుడు శివబాలాజీకి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. కాటమరాయుడు షూటింగ్ సందర్భంలో ఓ వ్యక్తి శివబాలాజీపై ఫేస్‌బుక్‌లో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడంతో ఆ సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కాటమరాయుడు సమయంలో
సకాలంలో కాటమరాయుడు చిత్రం రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాం అంటూ 2017లో సినిమా రిలీజ్‌కు ముందు ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. అందుకు సమాధానంగా ఓ వ్యక్తి బూతు మాట్లాడుతూ కామెంట్ పెట్టడంపై శివబాలాజీ తీవ్రంగా స్పందించాడు.

శివబాలాజీ భార్యకు
తాజాగా శివబాలాజీ భార్యకు అలాంటి పరిస్థితే ఎదురైంది. మధుమితకు ఈ-మెయిల్ ద్వారా ఓ వ్యక్తి అసభ్యకరమైన సందేశాలు పంపినట్టు శివ బాలాజీ ఫిర్యాదు చేశారు.

నిందితుడి గుర్తింపు
ఈ-మెయిల్ పంపిన వ్యక్తి ఆచూకీని ఐపీ అడ్రస్ ద్వారా పోలీసులు గుర్తించినట్టు తెలుస్తున్నది. త్వరలోనే నిందితుడిని పట్టుకొంటామని చెప్పినట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











