మరిచిపోలేని అనుభూతి.. శివబాలాజీ ఉద్వేగం
Recommended Video

'మా' కోసం పని చేస్తున్నా
మా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ హైదరాబాద్‌లోని ఎఫ్ఎన్‌సిసి క్లబ్‌లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ, టెలివిజన్, మీడియా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు రాళ్ళపల్లి, సినీ క్రిటిక్ గుడిపూడి శ్రీహరి, బిగ్ బాస్ విజేత శివ బాలాజీలను ఆత్మీయంగా సన్మానించారు.
ఈ సందర్బంగా శివబాలాజీ మాట్లాడుతూ.. నేను ''మా'' సభ్యుడిని. మా అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాను. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం ఎలాంటి సహాయానికైనా నేను సిద్ధంగా వుంటాను. బిగ్‌బాస్ విజేతగా నిలిచిన తర్వాత చాలా సన్మానాలు జరిగాయి. కానీ ఈ సన్మానం మా కుటుంబ సభ్యులు చేసినట్టు ఫీల్ అయ్యాను. అందరి మధ్య సన్మానం జరగడం మరిచిపోలేని అనుభూతి అని ఆనందం వ్యక్తం చేశారు.



Click it and Unblock the Notifications











