శివబాలాజీని వెంటాడిన బిగ్‌బాస్.. ఇంటికి వచ్చి రచ్చ రచ్చ

By Rajababu

Recommended Video

శివబాలాజీని వెంటాడిన బిగ్‌బాస్.. ఇంటికి వచ్చి రచ్చ రచ్చ

తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించిన తొలి రియాలిటీ షో బిగ్‌బాస్‌ బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించిన సంగతి తెలిసిందే. 70 రోజులపాటు రసవత్తరంగా సాగిన ఈ షోలో టాలీవుడ్ నటుడు శివ బాలాజీ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ షో ముగియడంతో ప్రేక్షకులు కొంత నిరాశపడిన విషయం తెలిసిందే. అయితే చాలా రోజుల తర్వాత గంభీరమైన బిగ్‌బాస్ గొంతు మళ్లీ వినిపించడంతో శివ బాలాజీ కొత్త అనుభూతికి గురయ్యారు. శివబాలాజీ ఇంటికి వచ్చి బిగ్‌బాస్ హడావిడి చేసిన వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తున్నది..

 సడెన్‌గా బిగ్‌బాస్ వాయిస్

సడెన్‌గా బిగ్‌బాస్ వాయిస్

బిగ్‌బాస్ విజేతగా నిలిచిన తర్వాత ఇంటర్వ్యూలు, ఇతర కార్యక్రమాలతో బిజీగా మారిన శివబాలాజీ ఇంట్లో ఏదో చేసుకొంటూ పరధ్యానంలో ఉండగా సడెన్‌గా బిగ్‌బాస్ గొంతు వినిపించింది. 70 రోజులు ఇంట్లో ఉండటం వల్ల ఇదంతా భ్రమ అని మళ్లీ తన పనిలో నిమగ్నమయ్యాడు. మళ్లీ అలానే బిగ్‌బాస్ గొంతు వినిపించింది. ఈ సారి మరింత ఉలిక్కిపడ్డారు శివబాలాజీ.

 భ్రమ పడొద్దు శివబాలజీ

భ్రమ పడొద్దు శివబాలజీ

నా వాయిస్ వింటున్నది నిజమే. భ్రమ అనుకొని పొరపాటుపడొద్దు. విజేతగా నిలిచినందుకు అభినందనలు తెలుపడానికి మీ ఇంటికి వచ్చాను అని బిగ్‌బాస్ అనగానే.. శివబాలాజీ స్పందిస్తూ.. థ్యాంక్యూ బిగ్‌బాస్.. మీరు ఆ రోజు కంగ్రాట్స్ చెప్పారుగా అని అన్నారు.

 స్నేహమేరా జీవితం మిలియన్ వ్యూస్

స్నేహమేరా జీవితం మిలియన్ వ్యూస్

అందుకు సమాధానంగా మీ ఇంటికి వచ్చింది. బిగ్‌బాస్ టైటిల్ విజేతగా నిలిచినందుకు కంగ్రాట్స్ చెప్పడానికి రాలేదు. మీ తదుపరి చిత్రం స్నేహమేరా జీవితం ట్రైలర్ ఒక మిలియన్ వ్యూస్ దాటినందుకు అభినందిస్తున్నాను. మీ చిత్రం ఎలా ఉండబోతుందో అనే విషయంపై తెలుసుకోవాలనుకొంటున్నాను అని బిగ్‌బాస్ అన్నాడు.

 శివ ఫ్రీజ్ అని బిగ్‌బాస్ ఆర్డర్

శివ ఫ్రీజ్ అని బిగ్‌బాస్ ఆర్డర్

నా స్నేహమేరా జీవితం ఇద్దరు స్నేహితుల గురించి. 80 దశకం నేపథ్యంగా ఉంటుంది అని శివ బాలాజీ చెప్పబోతుండగా శివ ఫ్రీజ్ అని బిగ్‌బాస్ ఆర్డర్ వేశాడు. నీ సినిమా గురించి ప్రేక్షకులకు ఓ టాస్క్ ఇవ్వబోతున్నాను. స్నేహమేరా జీవితం సినిమా ఎలా ఉండబోతుందో 60 సెకన్ల వీడియో తీసి గగన్ మ్యాజికల్ ఫ్రేమ్స్ ఫేస్ బుక్ పేజ్ ఇన్‌బాక్స్‌కు పంపించాలని ప్రేక్షకులకు టాస్క్ ఇచ్చారు.

 ప్రేక్షకులకు బిగ్ బాస్ టాస్క్

ప్రేక్షకులకు బిగ్ బాస్ టాస్క్

ఒకవేళ ప్రేక్షకులు పంపిన వీడియో సినిమా కథకు దగ్గరగా ఉంటే బిగ్‌బాస్ విన్నర్ శివబాలాజీ, అతని స్నేహితుడు, చిత్ర హీరో రాజీవ్ కనకాలను కలుసుకునే అవకాశం దక్కుతుంది అని బిగ్ బాస్ టాస్క్ పూర్తి చేశాడు.

వైరల్‌గా మారిన వీడియో

శివబాలాజీ నటించిన స్నేహమేరా జీవితం ప్రమోషన్ గురించి ఈ వీడియోను రూపొందించారు. ఈ చిత్రంపై ఆసక్తిని పెంచేందుకు బిగ్‌బాస్ వాయిస్‌ను ఉపయోగించుకోవడం చిత్ర నిర్వాహకుల క్రియేటివిటికి అద్దం పట్టింది. శివ బాలాజీ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం ఫేస్‌బుక్‌లో వైరల్‌గా మారింది. స్నేహమేరా జీవితం చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X