పవన్-క్రిష్ సినిమాలో కోలీవుడ్ స్టార్.. క్లారిటీ ఇచ్చిన టీమ్

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నాడు. వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తూ అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అయితే పవన్ జోరుకు కరోనా వైరస్ అడ్డుకట్ట వేసింది. అంతా సవ్యంగా జరిగి ఉండే వకీల్ సాబ్ రిలీజ్‌కు రెడీగా ఉండేది. క్రిష్ దర్శకత్వంలో రాబోతోన్న పీరియాడికల్ మూవీ షూటింగ్ కూడా ప్రారంభమయ్యేది.

మెఘలుల కాలం నాటి కథతో, రాబిన్ హుడ్ లాంటి క్యారెక్టరైజేషన్‌లో పవన్ కళ్యాణ్ నటించబోతోన్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వజ్రాల దొంగగా పవన్ నటించనున్నాడని టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఈ చిత్రంలో ఓ పవర్ ఫుల్ పాత్రను కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ పోషించబోతోన్నట్టు గత రెండు మూడు రోజులుగా వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి.

 Siva Karthikeyan Is Not Part In Pawan Kalyan Krish Project

తాజాగా ఆ వార్తలపై ఆయన పీఆర్ టీమ్ స్పందించింది. ఈ సినిమాకి సంబంధించి శివ కార్తికేయన్ ను ఎవరూ సంప్రదించలేదనీ, ఆయన ఈ సినిమా చేయడం లేదని అతని పీఆర్ టీమ్ చెప్పింది. ప్రస్తుతం తమిళ సినిమాలతో శివకార్తికేయన్ బిజీగా వున్నాడని చెప్పింది. పవన్-క్రిష్ సినిమాకు విరూపాక్ష అని టైటిల్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది. మరోవైపు ముమ్మరంగా హీరోయిన్ల వేట కూడా కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X