పవన్, క్రిష్ మూవీ విరూపాక్ష.. మరో స్టార్ హీరో ఎంట్రీ
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్‌లో వస్తున్న విరూపాక్ష చిత్రం సెట్స్‌పైకి వెళ్లకుండానే సంచలన వార్తలకు వేదిక అవుతుున్నది. చారిత్రాత్మక నేపథ్యంతో ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందనున్నది. అయితే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టు వర్క్ పూర్తయిందని, త్వరలోనే సెట్స్‌పైకి వెళ్తుందనే వార్తలు వచ్చాయి. అయితే కరోనా లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడిందనేది అందరికి తెలిసిందే.
పవన్ కల్యాణ్ పాలిటిక్స్‌కు వెళ్లిన తర్వాత వస్తున్న రెండో సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగా పెరిగాయి. కోహినూర్ వజ్రం చుట్టూ కథ తిరుగుతుందని, ఈ చిత్రంలో ఔరంగజేబు సైన్యంలో పనిచేసే ఆంధ్ర యోధుడు విరూపాక్షుడిగా పవన్ కల్యాణ్ నటించబోతున్నారని మెగా బ్రదర్ నాగబాబు వెల్లడించారు.

తాజాగా విరూపాక్ష (వర్కింగ్ టైటిల్)లో నటీనటుల ఎంపికను లాక్‌డౌన్‌లో పూర్తి చేస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగానే తమిళ నటుడు శివకార్తీకేయన్ ఈ చిత్రంలో కీలక పాత్రను పోషించడానికి అంగీకరించినట్టు సమాచారం. అయితే అధికారికంగా చిత్ర యూనిట్ ఇంకా ధృవీకరించలేదు.
ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్నది. చారిత్రాత్మక నేపథ్యంతో రూపొందే ఈ సినిమాకు కీరవాణి సంగీత దర్శకుడు. సైరా, RRR చిత్రానికి మాటలు రాసిన బుర్రా సాయిమాధవ్ రచయితగా పనిచేస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా సాయిబాబా వ్యవహరించనున్నారు.
వాస్తవానికి విరూపాక్షను 2020లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ కోవిడ్19 కారణంగా ఈ సినిమా షూట్ ఆలస్యంగా ప్రారంభం కానున్నది. అంతా సవ్యంగా సాగితే ఈ చిత్రం 2021లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











