విజయ్ దేవరకొండతో మళ్ళీ అలాంటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన నాని డైరెక్టర్

టాలీవుడ్ ఇండస్ట్రీలో నెవర్ బిఫోర్ ఎలా కాంబినేషన్స్ అయితే సెట్స్ పైకి వస్తున్నాయి. ఆడియెన్స్ కూడా అలాంటి కలయిక కోసమే ఎక్కువగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా డైరెక్టర్స్ హీరోల కలయిక చాలా కొత్తగా ఉందని చెప్పవచ్చు. ఊహించని దర్శకులతో విభిన్నమైన బాడీ లాంగ్వేజ్ కలిగిన హీరోలు సినిమాలు చేస్తుండడం విశేషం. నిన్నుకోరి, మజిలీ వంటి బాక్సాఫీస్ హిట్స్ అనంతరం టక్ జగదీష్ వంటి విభిన్నమైన సినిమాలు డైరెక్ట్ చేసిన దర్శకుడు శివ నిర్వాణ కూడా మొదటిసారి విజయ్ దేవరకొండ తో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.

ఓ వర్గం ప్రేక్షకుల్లో ఈ కాంబినేషన్ పై అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. ఎందుకంటే వీరి కాంబినేషన్లో రాబోయే సినిమా కూడా చాలా విభిన్నంగా ఉంటుందట ఇటీవల ప్రమోషన్లలో దర్శకుడు శివ నిర్వాణ సినిమాపై ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చేశాడు. శివ నిర్వాణ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో మంచి ఎమోషనల్ పాయింట్స్ హైలెట్ చేస్తూ ఉంటాడు. మొదటి నుంచి కూడా అతను హీరోలకు తగ్గట్టుగానే కథలను రెడీ చేసుకుంటూ వెళ్తున్నాడు. వరుసగా రెండు సినిమాలు అయితే బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు అందుకున్నాయి. సినిమా థియేటర్స్ లో విడుదల కావాల్సింది కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా ఓటీటీలో విడుదలవుతున్న విషయం తెలిసిందే.

ఇక ఈ సినిమా అనంతరం శివ నిర్వాణ విజయ్ దేవరకొండ తో చేయబోయే కొత్త సినిమా పై పూర్తి కథ ఇప్పటికే పూర్తి అయిందని టాక్ అయితే వస్తుంది. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో శివ నిర్వణ ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. విజయ్ దేవరకొండ తో చేయబోయే సినిమా పాన్ ఇండియా కాదు కానీ ఒకవేళ ఆయన లైగర్ సినిమా తర్వాత ఆలోచన విధానం మారితే తప్పకుండా నా దగ్గర ఉన్న కథలను మరొకసారి చెబుతాను. అందులో ఏదైనా పాన్ ఇండియా కాన్సెక్ట్ కు కరెక్ట్ అనిపిస్తే అలాంటి తరహాలోనే ముందుకు వెళతము.

Siva nirvana about vijay devarakonda project details

ఇక ఆయనకు నేను చెప్పిన కథ మాత్రం పాన్ ఇండియా కాదు. పూర్తిగా తెలుగు కామెడీ ఎంటర్టైన్మెంట్ తరహాలోనే ఉంటుందని అని ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. చూస్తుంటే విజయ్ దేవరకొండ గీతగోవిందం లాంటి సినిమాతో ఆకట్టుకునే అవకాశం ఉంటుందని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ లైగర్ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఒక టార్గెట్ అయితే సెట్ చేసుకున్నాడు.

దర్శకుడు పూరి జగన్నాథ్ ఆ సినిమా షూటింగ్ ఇప్పటికే 50 శాతంకు పైగా పూర్తి చేశాడు ఇక త్వరలో మిగతా షూటింగ్ ను ఒక భారీ సెట్ లో ఫినిష్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే వారికి కరోనా కాస్త ఇబ్బందులకు గురి చేస్తోంది. ఒకవేళ పనులన్నీ అనుకున్నట్లుగా జరిగితే సినిమా ఇదే ఏడాది విడుదల చేసే అవకాశం ఉన్నట్లు టాక్ అయితే వచ్చింది. ఇక విజయ్ బాక్సాఫీసు వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X