సినిమా హాళ్లపై దాడులు
మహారాష్ట్ర, కర్ణాటకల మధ్య సరిహద్దు వివాదం మరోసారి భగ్గుమంది. బెల్గాంలో మరాఠీయులపై కర్ణాటక పోలీసుల లాఠీఛార్జీకి నిరసనగా శివసేన అనుబంధ విభాగం భారతీయ విద్యార్థి సేన కార్యకర్తలు వీరంగం సృష్టించారు. పుణెలో కన్నడ చిత్రాన్ని ప్రదర్శిస్తున్న ఓ సినిమా థియేటర్‌పై బుధవారం దాడులకు దిగారు. నగరంలో కన్నడ చిత్రాలను ప్రదర్శించకూడదని విద్యార్థి సేన అధ్యక్షుడు అజయ్‌షిండే ఆదేశించారు. సినిమా అసోసియేషన్‌కు వినతిపత్రం సమర్పించినట్లు చెప్పారు. కొల్హాపూర్‌లో కన్నడ చిత్ర ప్రదర్శనను అడ్డుకున్నారు. నాసిక్‌లోనూ సేన కార్యకర్తలు ధర్నా జరిపారు.


Click it and Unblock the Notifications











