For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ బాధతో చనిపోవద్దు.. ఆమె మానసికంగా హింసించింది.. డైరీ చింపేశా.. శివశంకర్ మాస్టర్

|
Siva Shankar Master Reveals His Personal Life Problems In A Recent Interview || Filmibeat Telugu

సుమారు ఐదు దశాబ్దాలుగా వెండి తెరపై స్టార్ హీరోలకు నృత్యాలు సమకూర్చిన డాన్స్ డైరెక్టర్లలో శివశంకర్ మాస్టార్ ఒకరు. మూడు జనరేషన్ల హీరోలకు డ్యాన్స్ డైరెక్ట్ చేసిన ఘనత ఆయనది. ఎన్టీఆర్, ఏఎణ్నాఆర్, చిరంజీవి లాంటి అగ్రహీరోలకు బంపర్ హిట్ సాంగ్స్ ఇచ్చిన రికార్డు ఆయనకే సొంతం. వెండి తెరపైనే కాకుండా బుల్లితెర మీద డ్యాన్స్ రియాలిటీ షోలకు న్యాయనిర్ణేతగా హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శివశంకర్ మాస్టర్ తన వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితంలోని అనేక విషయాలు వెల్లడించారు. ఆయన ఏమన్నారంటే

46 ఏళ్లుగా ఇండస్ట్రీలో

దక్షిణాది సినీ పరిశ్రమలో 46 ఏళ్లుగా నేను పనిచేస్తున్నాను. డ్యాన్స్ డైరెక్టర్‌ సలీం మాస్టర్‌తో నా జీవితం ప్రారంభమైంది. ఆయన వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తూ ఆయన ప్రతిభను దగ్గరి నుంచి చూశాను. డ్యాన్స్‌లోని మెలుకువలు నేను గ్రహించాను. తమిళ చిత్రం ద్వారా డ్యాన్స్ డైరెక్టర్‌గా పరిచయం అయ్యాను. ఇప్పటి వరకు నేను సాధించిన విషయాలను చూసుకొంటే నా జీవితం సంతృప్తికరంగా ఉంటుంది.

చివరిశ్వాస ఉన్నంత వరకు

చివరి శ్వాస ఉన్నంత వరకు నేను సినిమా పరిశ్రమకు సేవ చేస్తాను. ఎంతకాలం బతికితే అంత కాలం నేను నా కెరీర్‌ను కొనసాగించాలని కోరుకొంటాను. ఆఫర్లు లేకుండా శివశంకర్ మాస్టారు కష్టాల్లో ఉన్నాడనే మాట వినిపించకుండా.. అలాంటి బాధ లేకుండా నేను చనిపోకూడదు అనేది నా కోరిక. ఇప్పటికీ నేను అనుభవం ఉన్న దర్శకుడిగా కాకుండా కొత్తగా వచ్చిన డ్యాన్స్ మాస్టర్‌గానే పనిచేస్తాను అని శివశంకర్ మాస్టర్ అన్నారు.

ఆ డైరీ చింపేశాను

నా తొలి సినిమా నుంచి ఇప్పటి వరకు ఎన్ని చిత్రాలకు, ఏ హీరోలతో పనిచేశాను. ఎన్ని పాటలకు కొరియోగ్రఫి అందించాను అనే విషయాలు డైరీలో రాసుకొనే వాడిని. ఈ మధ్యకాలంలో ఆ డైరీని చింపేశాను. ఎందుకంటే ఇన్ని సినిమాలకు నేను పనిచేశానా అనే అహం కలుగవచ్చు. ఇంకే చేద్దామనే ఆలోచన వస్తే నా జీవితం ఆగిపోతుంది. అందుకే నేను ఆ డైరీని చింపి పడేశాను. ఇప్పుడు నేను ఎన్ని సినిమాలకు పనిచేశాను అనేది నాకే తెలుసు అని శివశంకర్ మాస్టర్ అన్నారు.

ఎన్నో పాటలకు డ్యాన్స్ డైరెక్షన్

నేను ఎన్నో పాటలకు డ్యాన్స్ డైరెక్ట్ చేశాను. ప్రతీ పాట నా మనసుకు నచ్చినవే. ఈ పాట ఇష్టమంటే చెప్పడం కష్టం. ఓ పాట నచ్చిందంటే మరో పాటకు అన్యాయం చేశాననే ఫీలింగ్ కలుగుతుంది. అందుకే నేను ఫలానా పాట నాకు ఇష్టం అని చెప్పను. కొన్ని పాటలు నాకు బాగా నచ్చుతాయి. కొన్ని పాటలు తక్కువగా నచ్చుతాయి అని శివశంకర్ మాస్టర్ తెలిపారు.

నా కోడలితో మానసిక వేధనకు గురయ్యా

ఇటీవల కాలంలో నా వ్యక్తిగత జీవితంలో నాకు ఓ చేదు అనుభవం ఎదురైంది. మా కుటుంబం మానసిక వేధనకు గురైంది. మా కోడలు మమల్ని నానా హింసలు పెట్టింది. ఆమె డబ్బు కోసమే వచ్చింది. డ్యాన్స్ తప్ప మరో లోకం తెలియని మాకు కోర్టు మెట్లు ఎక్కించింది. ఓ సమస్యను ఎలా ఎదుర్కోవాలో అనే విషయాన్ని మాకు స్పష్టంగా నేర్పించింది అని శివశంకర్ మాస్టర్ ఆవేదన వ్యక్తం చేశారు.

English summary
One of the most popular director is Siva Shankar Master in south film Industry. He worked for five decades in film Industry. He speak to media and revealed his personal and private life things.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more