twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విక్రమ్-అనుష్క ‘శివ తాండవం’ సెన్సార్ రిపోర్ట్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : విక్రమ్ కథానాయకుడిగా రూపొందుతున్న తమిళ చిత్రం 'తాండవం'. ఈ చిత్రానికి తెలుగులో 'శివ తాండవం' అనే టైటిల్ తో రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఎ.ఎల్.విజయ్ దర్శకుడు. యు.టి. వి.మోషన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రోనీ స్ర్కూవాలా, సిద్ధార్థరాయ్‌కపూర్ నిర్మాతలు. అనుష్క, లక్ష్మీరాయ్, ఎమీజాక్సన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు కీలక పాత్రను పోషిస్తున్నాడు.

    తాజాగా ఈచిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు సభ్యులు ఈచిత్రానికి క్లీన్ 'U' సర్టిఫికెట్ జారీ చేసారు. సెప్టెంబర్ 28న ఈచిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా విడుదల చేయబోతున్నారు. ఇద్దరు స్నేహితుల ప్రయాణమే 'శివతాండవం' చిత్రం కథాంశం.

    ఇందులో విక్రమ్ పూర్తి వైవిధ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. గత చిత్రాలకు భిన్నంగా ఆయన పాత్ర చిత్రణ వుంటుంది. ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. జగపతిబాబు పాత్ర సినిమాకు ప్రత్యేకార్షణగా నిలుస్తుంది. అత్యున్నత ప్రమాణాలతో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. జి.విపకాష్‌కుమార్ సంగీతాన్నందిస్తున్నాడు.

    లక్ష్మీరాయ్‌, శరణ్య, సుజిత, కోట శ్రీని వాసరావు, నాజర్‌, సాయాజీ షిండే, ఎం.ఎం. భాస్కర్‌, ఢిల్లి గణేష్‌ ఇతన ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో ముఖ్య సన్నివేశాల్ని లండన్‌లో చిత్రీకరించారు. తెలుగులో ఈచిత్రానికి సంబంధించిన రిలీజ్ రైట్స్ నిర్మాత సి.కల్యాణ్‌ దక్కించుకున్నారు.

    English summary
    Vikram-starrer Siva Thandavam (Thaandavam in Tamil) has cleared the censor formalities and has obtained a clean U certificate. The film, which also has Anushka, Amy Jackson, Jagapathi Babu and Lakshmi Rai, is now set for a worldwide release on September 28.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X