హిట్టా-ఫట్టా: విక్రమ్-అనుష్క ‘శివతాండవం’ టాకేంటి?
హైదరాబాద్: విక్రమ్, అనుష్క, అమీ జాక్సన్ హీరో హీరోయిన్లుగా రూపొందిన తమిళ చిత్రం 'తాండవం' చిత్రం ఈ రోజు తెలుగులో 'శివతాండవం' పేరుతో రిలీజ్ అయింది. ఈ చిత్రంలో విక్రమ్ Raw ఏజెంటు పాత్ర పోషించగా, అనుష్క అతని భార్య పాత్ర చేసింది. అమీ జాక్స్ బ్యూటీ కాంటెస్ట్ విన్నర్‌గా, గుడ్డివాడైన విక్రమ్‌కి సన్నిహితంగా ఉండే పాత్రలో కనిపించింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలై ఈచిత్రం ఎబో యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది.
గుడ్డి వాడిగా, రా ఆఫీసర్‌గా విక్రమ్ అద్భుతంగా నటించాడు. అనుష్క ప్రెట్టీగా కనిపించడంతో పాటు మంచి నటన కనబరించింది. అయితే కొన్ని సీన్లకుమాత్రమే పరిమితం అయింది. అమీజాక్సన్ అందంగా కనిపించింది కానీ, నటన పరంగా మాత్రం ఆకట్టుకోలేక పోయింది. ఆమె హావభావాలు ప్రేక్షకులను మెప్పించ లేక పోయాయి. జగపతి బాబు తన పాత్రలో ఎంతో ఇంప్రెసివ్‌గా కనిపించాడు. నిరవ్ షా అందించిన ఫోటోగ్రాఫీ బాగుంది.
అయితే సినిమాలో కొత్త పాయింట్ ఉన్నా వినోదం పాళ్లు అంతగా లేక పోవడం కాస్త నిరాశ పరిచింది. ఇతర పాత్రలకు...నటీనటుల ఎంపిక గొప్పగా లేదు. అమీజాక్సన్, కమెడీయన్ సంతానం పాత్రలే అందుకు నిదర్శనం అంటున్నారు. అయితే విక్రమ్ పెర్ఫార్మెన్స్ కోసం తప్పకుండా చూడాల్సిన మూవీ అంటున్నారు చాలా మంది.
లక్ష్మీరాయ్, శరణ్య, సుజిత, కోట శ్రీని వాసరావు, నాజర్, సాయాజీ షిండే, ఎం.ఎం. భాస్కర్, ఢిల్లి గణేష్ ఇతన ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో ముఖ్య సన్నివేశాల్ని లండన్‌లో చిత్రీకరించారు. తెలుగులో ఈచిత్రానికి సంబంధించిన రిలీజ్ రైట్స్ నిర్మాత సి.కల్యాణ్ దక్కించుకున్నారు. జి.విపకాష్‌కుమార్ సంగీతాన్నందించారు.


Click it and Unblock the Notifications











