For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వివాదం....విక్రమ్ 'శివ తాండవం' రిలీజ్ వాయిదా

  By Srikanya
  |

  హైదరాబాద్ : విక్రమ్‌, జగపతిబాబు హీరోలుగా తేజ సినిమా పతాకాన విజయ్‌ దర్శ కత్వంలో సి.కళ్యాణ్‌ నిర్మించిన చిత్రం 'శివ తాండవం'. ఈ చిత్రం సెప్టెంబర్ 28న విడదల చేయాలని నిర్ణయిస్తూ దర్శక,నిర్మాతలు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అక్టోబర్ 8కి వాయిదా పడింది. నట్టికుమార్ ఈ చిత్రం స్ట్రైయిట్ చిత్రం కాదని,డబ్బింగ్ చిత్రం అంటూ ఫిల్మ్ ఛాంబర్ లో కంప్లైంట్ చేస్తూ మీడియా వద్ద చెప్పటంతో ఈ చిత్రం వాయిదా వేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ చిత్రానికి మళ్లీ సెన్సార్ చేయనున్నారని సమాచారం.

  'శివతాండవం'ని లో బడ్జెట్‌తో నిర్మించానని, స్ట్రయిట్ చిత్రం అని చూపించి పన్నుని ఎగ్గొట్టడం కోసం ఇటు ప్రభుత్వాన్ని, అటు సెన్సార్ బోర్డ్‌ని మోసం చేశాడు నిర్మాత సి. కళ్యాణ్. శివతాండవం స్ట్రయిట్ చిత్రం కాదు.. అనువాద చిత్రం. కానీ సి.కళ్యాణ్ దీన్ని స్ట్రయిట్ చిత్రమని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎఫ్‌డీసీని తప్పుదోవ పట్టించాడు. మాములుగా రెండు భాషల్లో సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో రెండు చిత్రాలకు సంబంధించిన సీడీలను పరిశీలించాలి. ఆ తర్వాతే అది స్ట్రయిట్ చిత్రమా లేక అనువాద చిత్రమా అని ధృవీకరించి సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తారు. కానీ 'శివతాండవం' విషయంలో దీన్ని ఉల్లంఘించారు. చలన చిత్ర వాణిజ్య మండలి కార్యదర్శి అశోక్ కుమార్ దీన్ని స్ట్రయిట్ చిత్రంగా ఆమోదించి, పబ్లిసిటీ క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇస్తే, సెన్సార్‌బోర్డ్ క్లీన్ 'యు' సర్టిఫికెట్‌ను ఇచ్చింది. క్షుణ్ణంగా పరిశీలించి ఒకవేళ ఇది అనువాద చిత్రమైతే కళ్యాణ్‌పై తగిన చర్యలు తీసుకోవాలి అని నట్టికుమార్ డిమాండ్ చేసారు అంటూ ఆరోపించారు నిర్మాతల సెక్టార్ అధ్యక్షుడు నట్టికుమార్.

  ఈ చిత్రంలో విక్రమ్ ఓ ఢిఫరెంట్ పాత్రలో రా ఆఫీసర్ గా కనిపించనున్నారు. అలాగే ఈ పాత్రకు ఉన్న మరో ప్రత్యేకత అంధుడిగా విక్రమ్ కనిపించటం. ఇక ఈ చిత్రం మరో ప్రత్యేకత ఏమిటీ అంటే..అనూష్క. ఆమె చిత్రం ప్లాష్ బ్యాక్ లో కనపడనుందని తెలుస్తోంది. ఇక మరో హీరోయిన్ గా చేస్తున్న అమీ జాక్సన్ పాత్ర హైలెట్ కానుంది. అమీ జాక్సన్ కి సంభందించిన సీన్స్ మొత్తం యు.ఎస్ లో చిత్రీకరించారు. అనూష్క ఎపిసోడ్ మొత్తం ఇండియాలో సాగుతుంది. చిత్రం కథ ఈ రెండు దేశాల్లో సాగుతుంది. ఈ చిత్రం స్టోరీ లైన్ గురించి దర్శకుడు ఎ.ఎల్ విజయ్ మాట్లాడుతూ..'అసాధారణ శక్తులున్న ఓ అంధుడి జీవిత కథే 'శివతాండవం. కాలగమనంలో కఠిన పరీక్షల్ని అతను ఎలా ఎదుర్కొన్నాడన్నదే చిత్ర ఇతివృత్తం. అతనిలో వున్న ఓ అసాధారణ శక్తి ఏమిటనేది సినిమాలో ఆసక్తికరమైన పాయింట్' అన్నారు.


  షాయాజీ షిండే, నాజర్, కోట శ్రీనివాసరావు, శంతనమ్ తదితరులు ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. విక్రమ్‌కి సౌత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో భారీ ఎత్తున ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అనుష్క, యామీ జాక్సన్‌, లక్ష్మీరాయ్‌, శరణ్య, సుజిత, కోట శ్రీని వాసరావు, నాజర్‌, సాయాజీ షిండే, ఎం.ఎం. భాస్కర్‌, ఢిల్లి గణేష్‌ ముఖ్య పాత్రధారులు.

  English summary
  Vikram and Jagapathi Babu starrer Siva Thandavam is not releasing this weekend. It postponed to next week. Although Tamil version, Thandavam, is hitting the screens on September 28th, the Telugu version ran into trouble when couple of producers challenged the producer C Kalyan's claim that Siva Thandavam is a straight Telugu film. Hence the delay in release. Siva Thandavam most probably would hit the screens on October 4th.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X