ఆర్య,చందమామ వంటి సినిమాలతో తానేమిటో ప్రూవ్ చేసుకున్న హీరో శివబాలాజీ, హీరోయిన్ మధుమితల వివాహం ఆదివారం నాడు హైదరాబాద్ లో జరగింది. బంజారాహిల్స్ లోని ఓ ఫంక్షన్ హాలులో ఆదివారం ఉదయం 10:36 కి వీరి వివాహం జరిగింది. ఇంగ్లీష్ కాదల్ అనే తమిళ చిత్రం లో వీరిద్దరూ జంటగా నటిస్తున్నప్పుడు చిగురించిన ప్రేమ ఇప్పుడు పెళ్ళిగా మారింది. పుట్టింటికి రా చెల్లి చిత్రంలో అర్జున్ చెల్లెలి గా నటించిన స్వప్న మాధురి (మధుమిత) శివబాలాజీల నడుమ నడిచిన రెండున్నరేళ్ళ ప్రేమ ను ఇద్దరి కుటుంబాలూ ఆమోదించడం తో ఆ మధ్య హైదరాబాద్ లో గల గోల్కొండ హోటల్ లో నిశ్చితార్ధ కార్యక్రమం జరిగింది. ప్రేమలో పడిన వీరిద్దరి పెళ్ళికి పెద్దలు సమ్మతించారు. ఉభయుల బంధుమిత్రులు సైతం ఈ పెళ్ళికి వచ్చి వధూవరులను ఆశీర్వదిస్తున్నారు. సినీ ప్రముఖులు దాసరి,పవన్ కళ్యాణ్,నితిన్,వెంకటేష్ ఈ వివాహానికి హాజరయ్యారు.