twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హైదరాబాద్ ఉప్పల్ బోనాల వేడుకలో... శివగామి, మాహిష్మతి సైన్యం!

    బోనాల వేడుకలో బాహుబలి శివగామి దర్శనమిచ్చింది. వేడుకలో భాగంగా బాహుబలి విగ్రహాలను ప్రతిష్టించారు.

    By Bojja Kumar
    |

    టాలీవుడ్ ప్రేక్షకులు సినిమాను కేవలం సినిమాగా మాత్రమే చూడరు... తమ జీవితంలో దాన్ని కూడా ఓ భాగంగా భావిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో సినిమాలపై ఉన్నంత మమకారం, స్టార్లపై ఉన్న అభిమానం, ఇష్టం ఇండియాలో ఇతర ప్రాంతాల్లో కనిపించదనే చెప్పాలి.

    ఇక్కడ కొన్ని సినిమాలు నిజ జీవితాల నుండి రూపాంతరం చెందుతాయి. అదే సమయంలో సినిమాలను ఫాలో అవుతూ తమ జీవితాల్లో మార్పులు చేసుకునే అభిమానులు ఉన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే... సినిమాలకు, తెలుగు ప్రజల జీవనానికి అవినాభావ సంబంధం ఉంది అని చెప్పొచ్చు.

    Sivagami statues in Hyderabad Uppal Bonalu celebrations

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో అతిపెద్ద హిట్ మూవీ 'బాహుబలి'..... భారత దేశ చరిత్రలోనే ఈ సినిమా ఓ సంచలనం. సినిమా మాత్రమే కాదు అందులోని క్యారెక్టర్లు కూడా బాగా పాపులర్ అయ్యాయి. సినిమాలో బాహుబలి క్యారెక్టర్ తర్వాత బాగా హైలెట్ అయింది బాహుబలి తల్లి పాత్ర 'శివగామి'.

    తాజాగా హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతంలో జరిగిన బోనాల వేడుకల్లో శివగామి విగ్రహం కనిపించడం చర్చనీయాంశం అయింది. శివగామితో పాటు మాహిష్మతి రాజ్యానికి చెందిన సైనికుల బొమ్మలు బోనాల జాతర ఉరేగింపులో దర్శనమిచ్చాయి.

    English summary
    The characters in Baahubali became very popular. There is no need to talk especially about Baahubali role. Similarly, Baahubali mother Sivagami role also became very famous. The audience were mesmerised by Ramya Krishna performance as Sivagami. Sivagami role became so popular that it has found a place in Bonalu celebrations.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X