నవీన్ మేడారంకు కలిసొచ్చిన వెబ్ సిరీస్.. డెవిల్ షాకిచ్చినా శివాజి సర్ ప్రైజ్ ఇచ్చాడుగా!

నందమూరి కల్యాణ్ రామ్.. ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చి అద్బుతమైన నటుడిగా పేరు తెచ్చుకున్న ఈయన తాజాగా డెవిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే కల్యాణ్ రామ్ హీరోగా చేసిన ఈ సినిమా డైరెక్షన్ లో విషయంలో అనేక ఆసక్తికర అంశాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకు 80 శాతం దర్శకత్వం వహించిన డైరెక్టర్ కు.. ఆ పేరును ఇవ్వలేరు. మిగతా 20 శాతం దర్శకత్వం వహించిన అతడికే డైరెక్టర్ అని సినిమాలో పేరు వేశారు. ఈ విషయాలు అందరికీ తెలిసినవే.

అయితే డెవిల్ సినిమా కోసం 100 రోజులు పని చేసిన నవీన్ మేడారంకు మూవీ టీం బిగ్ షాక్ ఇచ్చింది. 80 శాతం షూటింగ్ పూర్తి చేసిన నవీన్ కు కనీసం ఆ క్రెడిట్ కూడా ఇవ్వలేకపోయింది. దీంతో నవీన్ మేడారం చాలానే ఫీలయ్యాడు. గతంలో నైస్ టు మీట్ యూ అనే సినిమాకు డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ గా వ్యవహారించాడు. ఆ తర్వాత లండన్ లైఫ్, బాబు బాగా బిజీ లవంటి సినిమాలతో పాటు సిన్ అనే వెబ్ సిరీస్ కు దర్శకుడిగా పని చేశాడు. కానీ వీటితో ఆయనకు అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు. కానీ డెవిల్ సినిమాతో కచ్చితంగా మంచి పేరు వస్తుందనుకుంటే చివరి నిమిషంలో అది కూడా మిస్ అయిపోయింది.

Sivaji 90s Web Series Helped to Producer Naveen Medaram Check Details

కానీ గతంలో చేసిన ఓ వెబ్ సిరీస్ తాజాగా విడుదల అయింది. అయితే డెవిల్ సినిమా విడుదల అయిన వారం రోజులకే ఈ వెబ్ సిరీస్ రిలీజ్ కావడం.. అది కోలుకోలేని దెబ్బ కొట్టినా ఈ వెబ్ సిరీస్ మాత్రం ఆయనకు ఫుల్ లాభాలు తెచ్చిపెట్టింది. కేవలం లాభాలే కాదండోయ్ మంచి పేరు, ప్రఖ్యాతలను కూడా తీసుకొచ్చి పెట్టింది. అయితే ఆ వెబ్ సిరీస్ మరేదో కాదు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కంటెస్టెంట్ శివాజి నటించిన 90s వెబ్ సిరీస్.

శివాజి, వాసుకి ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ వెబ్ సిరీస్ తో వారం రోజుల్లోనే నవీన్ మేడారం జాతకం మారిపోయింది. మొన్నటి వరకు డైరెక్టర్ గా కూడా గుర్తింపు ఇవ్వలేని వాళ్లు ఈ వెబ్ సిరీస్ ను నిర్మించడంతో విపరీతమైన గుర్తింపును ఇస్తున్నారు. చాలా మంది ఈ వెబ్ సిరీస్ పై, దర్శక,నిర్మాతలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. డెవిల్ మూవీ టీం బిగ్ షాక్ ఇచ్చినా శివాజి హ్యాండ్ ఇచ్చి మరింత పైకి లేచేలా చేశాడంటూ సినీ విశ్లేషకులు వివరిస్తున్నారు.

Sivaji 90s Web Series Helped to Producer Naveen Medaram Check Details

అయితే 90s ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ అనే వెబ్ సిరీస్ చాలా అద్భుతంగా ఉంది. శివాజి, వాసుకిల పిల్లలుగా మౌళి వాసంతిక, రోహన్ రాయ్, స్నేహలు అద్భుతంగా నటించారు. ఫ్యామిలీ అంతా కలిసి ఎంచక్కా చూడగలిగే ఈ వెబ్ సిరిసీ ప్రస్తుతం ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఎవరూ ఊహించని స్థాయిలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ 90లలోని పిల్లలందరికీ కచ్చితంగా కనెక్ట్ అవుతుంది. అప్పుడు మనం చేసిన ప్రతీ వాటిని ఇందులో ఎంచక్కా చూసేయొచ్చు. మీరూ ఓసారి ఈ వెబ్ సిరీస్ ను చూసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X