గురుస్వామిగా శివాజీ
సీతారాముడు, టాటా బిర్లా.. లైలా చిత్రాల ద్వారా మంచి ఓపెనింగ్స్ సాధించిన నటుడు శివాజీ కెరీర్ ప్రస్తుతం వేగంగా ముందుకెళ్తోంది. ఆయన హీరోగా శరత్ చంద్ర ఫిలింస్ పతాకంపై ఒక భక్తిరస చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయ్యప్ప భక్తులను దృష్టిలో పెట్టుకుని తీస్తున్న ఈ చిత్రానికి గురుస్వామి అని టైటిల్ అనుకుంటున్నారు. అక్టోబర్ 18 నుంచి ప్రారంభమయ్యే ఈ చిత్రానికి దర్శకుడిగా డిఆర్ నాయక్ పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో ఏకకాలంలో నిర్మిస్తామని, చెన్నై, కేరళ, వైజాగ్, హైదరాబాద్ తదితర ప్రాంతాలలో షూటింగ్ ఏర్పాట్లు చేశామని నిర్మాతలు చెప్పారు.
అయ్యప్ప భక్తులను దృష్టిలో పెట్టుకుని వచ్చే మండల పూజల నాటికి ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని సంకల్పించినట్లు నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రం కోసం అయ్యప్ప టెంపుల్ సెట్, 18 పడిమెట్లు, అగ్ని గుండం, ధ్వజ స్తంభం వంటి సెట్స్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిర్మిస్తున్నట్టు నిర్మాతలు చెప్పారు.


Click it and Unblock the Notifications