హీరో శివాజిని చూసి నవ్వుకుంటున్నారు

By Srikanya

తెలుగు కామిడీలు,ఫ్యామిలీ సినిమాలు చేసుకుంటూ వెళ్థున్న శివాజికి ఈ మధ్యన ఆఫర్స్ లేక చతికలపడ్డాడు. అయితే తెలుగులో వర్కవుట్ కావటం లేదని భావించిన శివాజి తన ప్రతిభను బాలీవుడ్ వారివినాకి చూపాలనుకుంటున్నాడు. పప్పూ కాంట్ డాన్స్ సాలా టైటిల్ రూపొందే చిత్రంలో శివాజి నటిస్తున్నాడు. దాంతో ఈ మ్యాటర్ సినీ వర్గాల్లో నవ్వుకు కారణమైంది. ఇక్కడే బిజినెస్ లేక ఉన్న శివాజి మహాసముద్రం లాంటి బాలీవుడ్ లో ఏం చేస్తాడని అంటున్నారు, ఇక వినాయిక చవితి రోజు ఈ చిత్రానికి చెందిన ప్రారంభం జరిగిందని తెలుస్తోంది.

డివైన్ సొల్యూషన్స్ బ్యానర్ పై బాబూ బాయి, విశాల్ భగత్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.బంటి దూబే ఈ చిత్రం డైరక్ట్ చేస్తున్నాడు. రామ్ జీ గులాటి, దిలీప్ సేన్ లు ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇక శివాజి చేతిలో ఇప్పుడు సినిమాలు ఏమీ లేవు. తను స్వయంగా నిర్మించిన తాజ్ మహల్ ప్లాప్ కావటంతో జోరు తగ్గించాడు. అలాగే ఈ మద్యన శివాజి నటించిన అయ్యారే చిత్రం కూడా సగంలో అగిపోయింది. ఫైనాన్సియల్ కారణాలే కాక ఆ చిత్రం తనపై తీస్తున్నారంటూ నిత్యానంద కోర్టుకెక్కడం కూడా కారణమైంది. మరో ప్రక్క శివాజి కొలిమి అనే తెలంగాణ ఉద్యమం కి చెందిన చిత్రం కమిటయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X