twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తాజ్ మహల్ రీమేక్ ఫలిస్తుందా?

    By Staff
    |

    Taj Mahal
    కన్నడంలో సూపర్ హిట్టయి..రెండు వందల రోజులు నడిచిన తాజ్ మహల్ చిత్రం తెలుగులోకి రీమేక్ అవుతోంది. క్యూట్ ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఇక్కడ శివాజి హీరోగా నటిస్తున్నాడు. అయితే అతను ఇంకా ప్రేమకథలకు నప్పుతాడా, అందులోనూ యూత్ ఓరియెంటెడ్ ఫిల్మ్ లో అని చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజ్ మహల్ చిత్రాన్ని అక్కడ నూతన దర్శకుడు చంద్రు రచన చేసుకుని తాను ఏదైతే ఫీలయ్యాడో దాన్ని తెరకెక్కించాడు. అలాగే అభిమాన్ అనే సంగీత దర్శకుడు అందించిన పాటలు సైతం ఈ చిత్రానికి పూర్తి స్ధాయి ప్లస్ అయ్యాయి. అందులోనూ ఈ చిత్రం స్టోరీ లైన్ చాలా చిన్నగా ఉండి,రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ లా ముందుకు నడిచే కథనంతో ఉంటుంది.

    అంతేగాక ఈ చిత్రంలో టీనేజ్ లో పుట్టే ప్రేమ మీద దృష్టి పెట్టి తమ ప్యూచర్ ని చెడగొట్టుకునే యువత ని చూపించారు. ఇవన్నీ చూస్తూంటే శివాజీ ఎంతవరకూ హీరోగా న్యాయం చేస్తాడు అనేది ఓ పాయింట్ అయితే..ఎమ్.ఎస్.రాజు ఇలాగే గత సంవత్సరం టెమ్ట్ అయి కన్నడ సూపర్ హిట్ ముంగారమలైని వాన గా తెలుగు తెరకు అందించి డిజాస్టర్ టాక్ తెచ్చుకోవటం, అంతకు ముందు సంవత్సరం మరో కన్నడ సూపర్ హిట్ జోగిని వి.వి.వినాయిక్ తీసుకొచ్చి యోగిగా రీమేక్ చేసి పరాజయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. రీమేక్ చేయటం కన్నా డబ్బింగ్ చేస్తే ఆ ఫీల్ చెడకుండా ఉండే అవకాశం ఉందంటున్నారు. ఏం జరుగుతుంతో చూద్దాం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X