హీరో శివాజి డబ్బులు సేఫేనా?
హీరోగా సక్పెస్ చవిచూసి చాల కాలమైపోతుండడంతో ఇక తనకి తానే హిట్టిచ్చుకోవాలనే నిర్ణయం తీసుకుని శివాజీ నిర్మాతగా మారాడు. 'తాజ్ మహాల్" అనే కన్నడ హిట్ చిత్రం రీమేక్ రైట్స్ తీసుకుని తెలుగులో తెరకెక్కిస్తున్నాడు. శ్రీ వివాజీ ప్రొడక్షన్స్ పై అరుణ్ సింగరాజును దర్శకునిగా పరిచయం చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయి ప్రస్తుతం గ్రేడింగ్ వర్క్ జరుగుతోంది. రామానాయుడు స్టూడియోలో జరిగిన కార్యక్రమంలో డి.రామానాయుడు 'తాజ్‌మహల్' లోగోను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ 'చిత్ర దర్శకుడు అరుణ్ సాప్ట్‌వేర్ రంగానికి చెందినవాడైనా చిత్రరంగంపై శ్రద్ధతో అమెరికాలో ఇన్‌స్టిట్యూట్‌లో చేరాడు. నేను ఇంతకుముందు చేసిన 'ఇందుమతి' చిత్రానికి పనిచేశాడు. ఈ సినిమాకు కొత్తదర్శకుడు అయితే బాగుంటుందని అరుణ్‌ను పెట్టాం. చక్కని ప్రేమకథా చిత్రంగా ఒరిజినల్ వెర్షన్ ఏమాత్రం చెడిపోకుండా జాగ్రత్తగా డీల్ చేశాం' అని తెలిపారు. నవంబర్ 2న దాసరి చేతులమీదుగా ఆడియోను ఆవిష్కరిస్తున్నాం. అదేనెలలో సినిమాను విడుదల చేస్తున్నాం' అని చెప్పారు. శివాజీ సరసన శృతి నటిస్తోన్న ఈ చిత్రానికి తెలుగులో కూడా 'తాజ్ మహాల్" అనే టైటిల్ నే ఖరారు చేశారు. హీరో శ్రీకాంత్ కి తొలి హిట్ అయిన సినిమాకి కూడా 'తాజ్ మహల్" టైటిల్ కావడం విశేషం. మరి ఆ టైటిల్ శివాజీకి కూడా కలిసి వచ్చి అతను పెడుతున్న డబ్బులు వాపసు వస్తాయనే అనుకుందాం. ఇంకా ఈ చిత్రలో కోటశ్రీనివాసరావు, జీవా, కల్పన తదితరులు నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











