twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా గర్ల్ ప్రెండ్ బాగా వికారం

    By Staff
    |

    Sivaji
    శివాజి హీరోగా నిన్న రిలీజైన నా గర్ల్ ఫ్రెండ్ బాగా రిచ్ సినిమా పరమ వికారంగా ఉందని టాక్. 8 Heads in a Duffel Bag (1997) అనే హాలీవుడ్ సినిమాని పూర్తి స్ధాయి కాపీ చేస్తూ వచ్చిన ఈ చిత్రం చివరకు ఓపినింగ్స్ కూడా తెచ్చుకోలేకపోయింది. నిజానికి ఈ సినిమా హాలీవుడ్ లోనూ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. సెటైర్ సినిమాగా దీన్ని తీసానని దర్శకుడు తర్వాత చెప్పుకున్నా అంతా అతన్ని, అతని చీప్ టేస్ట్ ని అంతా తిట్టిపోసారు. దాంతో అలాంటి సినిమాను కాపీ కొట్టి, హిట్టు కొట్టాలనే దర్శకుడు కోరికను అందరూ తిట్టిపోస్తున్నారు. ఇక షూటింగ్ సమయంలో శివాజీ..ఆ నిర్మాతలను నానా రకాల హింసలకు గురిచేసాడని చెప్పుకున్నారు. అందుకు తగినట్లుగా సినిమాకూడా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.

    ఇక ఈ సినిమా కథ ఓ ఎనిమిది తెగిన తలకాయల చుట్టూ తిరుగుతుంది. సంజయ్ శాస్త్రి (శివాజి)ఎవరైనా డబ్బున్న అమ్మాయిని పట్టి లైఫ్ లో సెటిల్ అయిపోవాలనే కోరిక ఉన్న గోల్ఫ్ ఛాంపియన్. అతని కోరిక ఫలించి శ్రావ్య(కావేరి ఝా) పరిచయమవుతుంది. అది ప్రేమగా మారిన తర్వాత మా పెద్దలును ఒప్పిస్తానని బ్యాంకాక్ బయిలుదేరుతుంది. అనంతరం కొన్ని రోజులకు కొన్ని తింగరి సంఘటనలు జరిగాక మన హీరోని అక్కడికి రమ్మని కబురు పంపుతుంది. అయితే ఈ ప్రయాణంలోనే ట్విస్ట్ పడుతుంది. ఫ్లయిట్ లో ప్రక్క సీట్ లో మైక్ టైసన్(బ్రహ్మానందం)కూర్చుని ఉంటాడు. అతనో కిల్లర్. అతని బ్యాగ్ లో అతని చంపిన మనుషులు తలకాయలు ఉంటాయి.

    ఆ బ్యాగ్..మన హీరో బ్యాగ్ తో తారుమారు అయిపోతుంది. అక్కడ నుండి కామెడీ పుడుతుందనుకుని ఫిక్స్ అయి సినిమా చేసారు. అయితే అక్కడనుండే ప్రేక్షకులుకు తలనొప్పి ప్రారంభం కావటం విషాదం. ఇక ఈ సినిమాకు కావేరీ ఝా అందచందాలు వర్కవుట్ అవుతాయనుకుని ప్లాన్ చేసారు. అదీ వికటించింది. అలాగే రచయత వేమగిరి..తన మల్లెపూవు సినిమా అనంతరం మరో చెత్త రాసాడు. బ్యాడ్.ఏదైమైనా వరస తెలుగు ఫ్లాప్ లిస్టులో మరొకటి చేరింది. ఎన్నో ఆశలుపెట్టుకుని సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన మరో నిర్మాత బలై పోయాడు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X