'ఆశ..దోసె...అప్పడం' అంటున్న కామెడీ హీరో
హైదరాబాద్ : శివాజి మరో కామెడీ చిత్రం చేస్తున్నారు. 'ఏం బాబూ లడ్డూ కావాలా.!' దర్శకుడు గాంధీ మనోహర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. సోనీ చోప్రా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి టైటిల్ 'ఆశ..దోసె...అప్పడం' అని ఖరారు చేసినట్లు సమాచారం. ఈ చిత్రం ఆధ్యంతం నవ్విస్తుందని, కొత్త తరహా కామెడీతో సినిమా నడుస్తుందని దర్శక,నిర్మాతలు చెప్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి.
ఈ చిత్రంలో శివాజి తో పాటు వినాయకుడు ఫేమ్ కృష్ణుడు, అమ్మాయిలు-అబ్బాయిలు ఫేమ్ విజయ్ శాయి కూడా ఈ చిత్రంలో కీ రోల్స్ లో కనిపించనున్నారు. ఈ చిత్రం గురించి దర్శకుడు గాంధీ మనోహర్ మాట్లాడుతూ... ఇది ముగ్గరు ఫ్రెండ్స్..ఒకేసారి పెళ్లిచేసుకోవాలనుకుని ప్లాన్ చేసుకుంటే...అది ఏ విధమైన మలుపు తిరిగింది. వారికి ఎలాంటి భార్యలు దొరికారు అన్నది కామెడీగా చూపిస్తున్నాం. ప్రతీవారూ తమని తాము ఐడింటిఫై చేసుకునే చిత్రం రూపొందింది...షూటింగ్ పూర్తైంది..త్వరలోనే విడుదల తేదీ ప్రకటించటం జరుగుతుంది అన్నారు.
హీరో శివాజి మాట్లాడుతూ.... సరికొత్త నేపథ్యంలో గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో థ్రిల్లింగ్ అంశాలతో పూర్తి స్ధాయి కామెడీ చిత్రంగా ఈ చిత్రం రూపొందుతోంది అని తెలిపారు. ఇక ఈ చిత్రాన్ని గురుడు చిత్ర నిర్మాత సి.డి నాగేంద్ర నిర్మించారు. చిత్రంలో మిగతా పాత్రల్లో చిత్రం శ్రీను,విష్ణు ప్రియ, అనిత, జెమినీ రాఘవ, చంటి, చంద్ర తదితరులు నటించారు. చిత్రానికి ఛాయాగ్రహణం..మురళి మోహన్ రెడ్డి, సంగీతం రఘురామ్ అందించారు.


Click it and Unblock the Notifications












