శ్రీకాంత్ వల్లే మెగాస్టార్‌తో, శాడిస్ట్‌లాగా ప్రవర్తించాడు.. నరేష్‌పై దుమ్మెత్తిపోసిన శివాజీ రాజా!

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. మా అసోసియేషన్ కు మార్చి 10న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత అధ్యక్షుడు శివాజీ రాజా పదవీకాలం ముగియడంతో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. సీనియర్ నటుడు నరేష్, శివాజీ రాజా అధ్యక్ష పదవి కోసం పోటీలో నిలిచాడు. నరేష్ తరుపున ప్యానల్ సభ్యులుగా హీరో రాజశేఖర్, జీవిత దంపతులు బరిలో నిలిచారు. శివాజీరాజాకు శ్రీకాంత్, కమెడియన్ పృథ్వి, నటుడు నాగినీడు లాంటి వాళ్లంతా మద్దత్తునిస్తున్నారు. గురువారం శివాజీ రాజా మీడియా సమావేశంలో మాట్లాడుతూ నరేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ప్రాణం పోయినా తప్పు చేయం

ప్రాణం పోయినా తప్పు చేయం

ఇలా ప్రెస్ మీట్స్ నిర్వహించి మరొకరిపై విమర్శలు చేయడం తనకు ఇష్టం లేదని శివాజీ రాజా అన్నారు. ఇక తప్పని పరిస్థితుల్లోనే మీడియా సమావేశం నిర్వహించాల్సి వస్తోందని శివాజీ రాజా అన్నారు. టివీల్లోకి వెళ్లి మాట్లాడకూడదు అనే రూల్ ఉన్నా బ్రేక్ చేసి నానా హంగామా చేస్తున్నారని శివాజీ రాజా అన్నారు. ప్రాణం పోయినా తాను, శ్రీకాంత్ తప్పు చేయం అని శివాజీ రాజా తెలిపారు. ఆ అవసరం కూడా తనకు లేదని తెలిపాడు.

 మెగాస్టార్ లాంటి వ్యక్తితో

మెగాస్టార్ లాంటి వ్యక్తితో

నరేష్ ని శివాజీ రాజా విమర్శిస్తూ.. నరేష్ న సోదరుడే.. ఇప్పటికి మేమిద్దరం బావుంటాం. కానీ నన్ను దారుణంగా అవమానించాడు. అది తలచుకుంటే గుండె తరుక్కుపోతోంది. ప్రెసిడెంట్ పదవిని కూడా అవమానించాడు. చాలా కార్యక్రమాల్లో నరేష్ నాకు ఎలాంటి సహకారం అందించలేదు. బిజీగా ఉన్నాను అని చెబితే అర్థం చేసుకుని సర్దుకుపోయా. కానీ మెగాస్టార్ చిరంజీవి లాంటి వ్యక్తితో ఈవెంట్ నిర్వహిస్తే.. దాని రిహార్సల్స్ కి కూడా నరేష్ హాజరు కాలేదని శివాజీ రాజా విమర్శించారు. శ్రీకాంత్ లాంటి గ్రేట్ ఫ్రెండ్ తోడుగా ఉండబట్టే ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించగలిగా, నిధులు సేకరించగలిగా అని శివాజీ రాజా తెలిపారు.

శాడిస్ట్‌లాగా ప్రవర్తించాడు

శాడిస్ట్‌లాగా ప్రవర్తించాడు

తాను సాధారణంగా బర్త్ డే జరుపుకోనని, ఆ రోజు కుటుంబ సభ్యులతో గుడికి వెళుతుంటానని శివాజీ రాజా తెలిపారు. కానీ మా అధ్యక్షుడిని అయ్యాక వీళ్లంతా బలవంత పెడితే ఒకే చెప్పాను. అసోసియేషన్ లో పార్టీ ఏర్పాటు చేశారు. నరేష్ జనరల్ సెక్రటరీ కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. అంతా 9:30 గంటలకు పార్టీకి అటెండ్ కావాలని నరేష్ గారి పేరుమీద అందరికి మెసేజ్ వెళ్ళింది. నా సతీమణిని గుడికి వెళ్లి ఎదురుచూస్తూ ఉండు, నేను పార్టీ ముగించుకుని వస్తా అని చెప్పా. అసోసియేషన్ కు వెళితే నరేష్ శాడిస్ట్ లాగా ప్రవర్తించాడు అని శివాజీ రాజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

నేను పగపడితే

నేను పగపడితే

9:30 గంటలకు అంతా హాజరు కావాలని అనుకున్నాం.. 10:30 గంటలు అయినా నరేష్ రాలేదు. ఏమైందో కనుక్కో అని అడిగితే.. ట్రాఫిక్ లో ఉన్నాడు, పక్క వీధిలో ఉన్నాడు అనిచెప్పారు. 11 గంటలకు ఎవరికో ఫోన్ చేసి చెప్పాడట తాను రావడం లేదని. చూశావా బర్త్ డే రోజునే ప్రెసిడెంట్ ని ఎలా వెయిట్ చేయించానో.. నేను పగపడితే ఇలాగే ఉంటుంది అని అన్నాడట. ఇలాంటి శాడిజం ఉన్న వ్యక్తా అధ్యక్ష పదవిలో కూర్చునేది అని శివాజీ రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆత్మహత్య చేసుకుంటా

ఆత్మహత్య చేసుకుంటా

తాను ఇప్పటికే ఓసారి అధ్యక్షుడిగా చేశా. రెండో సారి చేయాలనే కోరిక లేదు. కానీ వీళ్లంతా బలవంతపెట్టడం వలన అంగీకరించా అని శివాజీ రాజా తెలిపారు. ఓ ఆర్టిస్టు నాతో మాట్లాడుతూ మీరు కనుక అధ్యక్షుడు కాకపోతే ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పింది. వాళ్లందరి ప్రేమని కాదనలేక ఈ ఒక్కసారికి పోటీకి దిగుతున్నాని శివాజీ రాజా తెలిపారు. నెక్స్ట్ టైం దేవుడొచ్చి చెప్పినా చేయను అని శివాజీ రాజా తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X