twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా.. అకౌంట్‌లో 7 లక్షలే, మిగిలిన డబ్బు ఏమైనట్లు.. శివాజీ రాజా!

    |

    Recommended Video

    Shivaji Raja Press Meet : Shivaji Raja Controversial Comments On Nagababu | Filmibeat Telugu

    ఇటీవల జరిగిన మా అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ పడిన శివాజీ రాజా, నరేష్ విభేదాలు లేవంటూనే ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. మార్చి 10న మా అసోసియేషన్ ఎన్నిక ముగిసింది. నరేష్ ప్యానల్ విజయం సాధించింది. నరేష్ ప్యానల్ లో పోటీ చేసిన జీవిత, రాజశేఖర్ కూడా విజయం సాధించారు. త్వరలో నరేష్ మా అసోసియేషన్ అధ్యక్షుడిగా భాద్యతలు స్వీకరించబోతున్నారు. ఎన్నిక ముగిసిన తర్వాత కూడా శివాజీరాజాని విమర్శించేందుకు నరేష్.. నరేష్ ని విమర్శించేందుకు శివాజీ రాజా వరుస ప్రెస్ మీట్స్ పెడుతున్నారు. తాజాగా జరిగిన మీడియా సమావేశంలో శివాజీ రాజా నరేష్‌ని విమర్శిస్తూ, నాగబాబుపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.

    చిరంజీవిగారు కేటీఆర్‌తో మాట్లాడి

    చిరంజీవిగారు కేటీఆర్‌తో మాట్లాడి

    శివాజీ రాజా మాట్లాడుతూ.. తాను ఈ సందర్భంగా చిరంజీవిగారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి అని అన్నారు. మా అసోసియేషన్ సొంత భవన నిర్మాణం కోసం నువ్వు పడుతున్న కష్టం చూశా. కేటీఆర్ తో మాట్లాడి నేను సైట్ ఇప్పిస్తా అని అన్నారు. అది జరిగేలోపే నేను పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అది జరిగి ఉంటే నా కల సాకారం అయ్యేది.. బ్యాడ్ లక్ అని శివాజీ రాజా అన్నారు. బిజీగా ఉన్నా చిరంజీవిగారు నాకోసం అమెరికాకు వచ్చి ప్రోగ్రాం చేశారని శివాజీ రాజా తెలిపారు.

    మురళీ మోహన్ ఉన్న టైం నుంచి

    మురళీ మోహన్ ఉన్న టైం నుంచి

    విజయ నిర్మలకి కూడా శివాజీ రాజా కృతజ్ఞతలు తెలిపారు. మురళి మోహన్ ప్రెసిడెంట్‌గా ఉన్న సమయం నుంచి ఆమె ప్రతినెలా 15 వేలు సాయం చేస్తున్నారని, ఆమె దాతృత్వానికి పాదాభివందనం చేయాలని శివాజీరాజా తెలిపారు. ఇకపై ఎవరూ మీడియా సమావేశాలు నిర్వహించి మా అసోసియేషన్ ని రోడ్డుమీదికి లాగొద్దు అని శివాజీ రాజా పేర్కొన్నారు.

    పదవి పట్టుకుని వేలాడటం లేదు, చిల్లరగా ప్రవర్తిచకండి: ‘మా'జీ అధ్యక్షుడు శివాజీ రాజాపదవి పట్టుకుని వేలాడటం లేదు, చిల్లరగా ప్రవర్తిచకండి: ‘మా'జీ అధ్యక్షుడు శివాజీ రాజా

     కుర్చీలో ఎందుకు ఉన్నారు

    కుర్చీలో ఎందుకు ఉన్నారు

    తాను ప్రెస్ మీట్ నిర్వహించకూడదని అనుకున్నా. కానీ నరేష్ చేసిన ఆరోపణల వల్ల చాలా మంది ఫోన్ చేసి అడుగుతున్నారు. ఎలక్షన్ అయిపోయింది కదా.. ఇంకా కుర్చీలో ఎందుకు ఉన్నారు అని ఫోన్ చేసి అడుగుతున్నారు. ఆ విషయంలో క్లారిటీ ఇవ్వడానికి ప్రెస్ మీట్ పెట్టినట్లు శివాజీ రాజా తెలిపారు. నేను రెండు సార్లు ట్రెజరర్‌గా, రెండు సార్లు వైస్ ప్రెసిడెంట్‌గా, ఒకసారి ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహించా. ఇవి కాక మా అసోసియేషన్‌లో ఎన్నో భాద్యతలు చేపట్టా. నాకు ఇంకా పదవి మీద ఆశ ఉంటుందా అని శివాజీ రాజా ప్రశ్నించారు.

     నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్

    నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్

    నాగబాబు నాకు 30 ఏళ్ల నుంచి స్నేహితుడు. ఆయన నాకు గిఫ్ట్ ఇచ్చారు. నేను తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి గిఫ్ట్ ఇస్తారని ప్రశ్నించగా ఇది నాగబాబు కోసం నిర్వహించిన ప్రెస్ మీట్ కాదంటూ దాటవేశారు. ఒకటవ తేదీ నేను కొత్తగా వచ్చే సభ్యులకు అకౌంట్స్ అప్పగించాలి. ఎలాంటి తేడాలు ఉన్నా నేను భాద్యత వహించాలి. కాబట్టి మీడియా ముఖంగా ఓ ప్రశ్న అడుగుతున్నానని నరేష్‌పై సంచలనం ఆరోపణలు చేశారు.

    7 లక్షలు ఏమైనట్లు

    7 లక్షలు ఏమైనట్లు

    ప్రతి ఏడాది నేనే డైరీ వేస్తా. కానీ ఈ సంవత్సరం నేను వేస్తా అంటూ నరేష్ వచ్చాడు. అలాగే ఈ ఒక్క పని అయినా చేసిపెట్టు అని అతడికి భాద్యతలు అప్పగించా. డైరీలో 14 లక్షలు వచ్చాయని స్వయంగా నరేషే తెలిపాడు. కానీ అకౌంట్‌లో 7 లక్షలు మాత్రమే పడ్డాయి. మిగిలిన 7 లక్షలు ఏమైనట్లు అని శివాజీ రాజా ప్రశ్నించారు. మీవైపు తప్పులు పెట్టుకుని ఎదుటివారిని ప్రశ్నించకూడదని శివాజీ రాజా అన్నారు. ఆ డబ్బు ఏమైందో చెప్పి ప్రమాణస్వీకారం చేస్తే బావుంటుందని అన్నారు. నరేష్ ప్రకటించిన మేనిఫెస్టో అలాగే అమలు చేస్తే ఎప్పటికి అతడే మా ప్రెసిడెంట్‌గా ఉండేలా చేస్తానని శివాజీ రాజా అన్నారు.

    English summary
    Sivaji Raja sensational comments on Nagababu and Naresh
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X