మెంటల్ మదిలో గురించి చెబుతూ.. ఉద్వేగానికి గురైన శివాజీ రాజా
నటుడు శివాజీ రాజా మాట్లాడుతూ నేను ఎక్కడ ఎక్కువగా మాట్లాడను నాకు మాట్లాడటం చేతకాదు.అబద్ధాలు చెప్పను
Recommended Video

పెళ్లి చూపులు లాంటి ప్రయోగాత్మక చిత్రం రూపొందించిన నిర్మాత రాజ్ కందుకూరి నిర్మించిన చిత్రం 'మెంటల్ మదిలో. శ్రీవిష్ణు, నివేద పేతురాజ్ జంటగా దర్శకుడు వివేక్ ఆత్రేయ రూపొందించిన ఈ సినిమా ఈ నెల 24 విడుదలైంది. ఈ సందర్బంగా రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా సక్సెస్ మీట్ జరిగింది.
నటుడు శివాజీ రాజా మాట్లాడుతూ.. నేను ఎక్కడ ఎక్కువగా మాట్లాడను నాకు మాట్లాడటం చేతకాదు. అబద్ధాలు చెప్పను. ఏం వున్నా మొహం మీదే చెప్పేస్తాను అని అన్నారు. మెంటల్ మదిలో సినిమా గురించి చెప్తూ చాలా బాగా నటించారు అని చాలా రోజుల తర్వాత నాకు చాలా మంది ఫోన్స్ చేస్తున్నారు అభినందిస్తున్నారు అని తెలిపారు. ఇలాంటి ఒక కథ దగ్గరకు తీసుకొచ్చినందుకు చిన్నవాడైన వివేక్ కి నా ధన్యవాదాలు.
వివేక్ మా ఇంటికి వచ్చి కథ చెప్పినప్పుడు ఇలాంటి వాళ్ళు వస్తూనే వుంటారు చెప్తూనే వుంటారులే అనుకున్నా కానీ షూటింగ్ వుంది అని చెప్పినప్పుడు ఓకే అనుకుని వెళ్ళినా షూటింగ్ లొకేషన్లో అందరు చిన్న పిల్లలు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, నాకు వీళ్లను చూస్తే స్కూల్ కి వెళ్లినట్టు అనిపించింది. పైగా సైలెంట్ ఉంటారు. ఎవ్వరు అల్లరి చెయ్యరు అంటూ సినిమా అనుభవాలను పంచుకుంటూ శివాజీ రాజా ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు.


Click it and Unblock the Notifications











